నా భార్య అలాంటి అమ్మాయై ఉండాలి... విజయ్ దేవరకొండ కామెంట్స్!

Published : Aug 31, 2023, 01:31 PM IST
నా భార్య అలాంటి అమ్మాయై ఉండాలి... విజయ్ దేవరకొండ కామెంట్స్!

సారాంశం

హీరో విజయ్ దేవరకొండ ఖుషి చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అభిమానులతో ముచ్చటించిన ఆయన పెళ్లి, భార్య వంటి వ్యక్తిగత విషయాలపై స్పందించారు. 

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఖుషి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ తో ఆన్లైన్ చాట్ చేశాడు. ఈ క్రమంలో అభిమానులు పెళ్లి ఎప్పుడు? భార్య ఎలా ఉండాలి? అని అడిగారు. ఈ వ్యక్తిగత ప్రశ్నలకు విజయ్ దేవరకొండ సహనంగా సమాధానం చెప్పాడు. ఆయన మాట్లాడుతూ... ''నన్ను జాగ్రత్తగా చూసుకునే భార్య కావాలి. నేను వర్క్ లో పడితే అన్నం కూడా మర్చిపోతా. నా బేసిక్ థింగ్స్ గుర్తు చేసే అమ్మాయి కావాలి. ఇప్పుడు మా అమ్మ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆమె బాధ్యత రాబోయే అమ్మాయి తీసుకోవాలి. నాకు పర్సనల్ లైఫ్ ఒకటి ఉందని గుర్తు చేయాలి. పెళ్లి చాలా నిరాడంబరంగా జరుగుతుంది. ఈ ఏడాది వచ్చే ఏడాది అని టైం ఫిక్స్ చేసుకోలేదు. జరిగినప్పుడు జరుగుతుంది. అప్పుడు పెళ్లి గురించి నేను దాచలేను'' , అని అన్నారు. 

కాగా ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టి విజయ్ దేవరకొండ పెళ్లిపై ఊహాగానాలు రేపారు. రెండు చేతులు కలిసిన ఫోటో పెట్టి ఆసక్తికర విషయం అన్నాడు. దీంతో కాబోయే భార్యనో లేక ప్రేయసినో విజయ్ దేవరకొండ పరిచయం చేస్తున్నాడని ప్రచారం జరిగింది. ఇక రష్మిక మందానతో విజయ్ దేవరకొండ ఎఫైర్ నడుపుతున్నాడనే ప్రచారం ఉంది. 

మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే... నాకు డబ్బు, గౌరవమే స్ఫూర్తి అన్నాడు. అవి రెండే నన్ను జీవితంలో ఏదైనా సాధించాలనే కసి రేపాయి అని విజయ్ దేవరకొండ అన్నాడు. ఇంటి అద్దె కట్టలేని ఆర్థిక ఇబ్బందులు కూడా చూశానని ఆయన అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ లో ఒకరిగా విజయ్ దేవరకొండ ఎదిగాడు. సినిమాకు రూ. 20 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. 

ఖుషి(Kushi) మూవీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఖుషి చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. సమంత(Samantha) హీరోయిన్ గా నటించగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ-సమంత ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సైతం హైలెట్ అయ్యింది. 

మరోవైపు విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరూ ప్లాప్స్ లో ఉన్నారు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. చెప్పాలంటే గీత గోవిందం తర్వాత ఆయనకు క్లీన్ హిట్ లేదు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఓ హిట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సమంత గత చిత్రం శాకుంతలం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఖుషితో కమ్ బ్యాక్ కావాలని ఆమె కోరుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?