హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ.. మాస్ మహారాజ్ సినిమాలో కీలకపాత్ర..?

Published : Feb 01, 2022, 01:12 PM IST
హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ.. మాస్ మహారాజ్ సినిమాలో కీలకపాత్ర..?

సారాంశం

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు వేణు తొట్టెంపూడి(Venu). అన్ని రకాల ఆడియన్స్ చూడగలిగే సినిమాలు చేసిన వేణు వెండితెరకు దూరం అయ్యి చాలా కాలం అవుతుంది. ఇక ఇంత కాలానికి మళ్లీ వేణు (Venu) సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు వేణు తొట్టెంపూడి(Venu). అన్ని రకాల ఆడియన్స్ చూడగలిగే సినిమాలు చేసిన వేణు వెండితెరకు దూరం అయ్యి చాలా కాలం అవుతుంది. ఇక ఇంత కాలానికి మళ్లీ వేణు (Venu) సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

వేణు తొట్టెంపూడి(Venu) ఈ  పేరు వినగానే చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకుల మదిలో మెదులుతాయి. ముఖ్యంగా స్వయంవరం, కల్యాణ రాముడు లాంటి మంచి సినిమాలు గుర్తుకు వస్తాయి. జగపతి బాబు, శ్రీకాంత్(Srikanth) లాంటి వారి తరువాత ఈ జనరేషన్ లో ఫ్యామిలీ హీరో అనిపించుకుంది వేణునే. కామెడీతో పాటు యాక్టింగ్ టాలెంట్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు(Venu)...కెరీర్ బిగినింగ్ లోనే హిట్ కొట్టాడు.

 ఆ తరువాత హనుమాన్ జంక్షన్.. పెళ్ళాం ఊరెళితే లాంటి సినిమాలు వేణు (Venu)కి మంచి మంచి క్రేజ్ ను తీసుకువచ్చాయి ఒక వైపున సోలో హీరోగా  సినిమాలు చేసుకుంటూనే మరో వైపు శ్రీకాంత్, అర్జున్, జగపతి బాబు, ఎన్టీఆర్ లాంటి  స్టార్స్ తో  మల్టీ స్టారర్ చేశాడు వేణు(Venu). ఆ తరువాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగాను కనిపించాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని కెరియర్ పరంగా బిజీగా ఉండగానే ఆయన సినిమాలకి దూరమయ్యాడు.

సినిమాకు దూరం అయిన వేణు(Venu) తనకు తన ఫ్యామిలీకి ఉన్న బిజినెస్ చూసుకుంటూ బిజీ అయిపోయాడని తెలిసింది. అయితే గత కొంత కాలంగా వేణు సినిమాల్లోకి రీ ఎంట్రీ కోసం  ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మంచి పాత్ర కోసం ఆయన వెయిట్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు మాస్ మహారాజ్  రవితేజ(Ravi Teja) హీరోగా చేస్తున్న ధమాకా సినిమా కోసం మేకర్స వేణుని సంప్రదించినట్టు సమాచారం.

ఈ సినిమాలో వేణు(Venu) ఓ కీలకమైన పాత్రను చేయనున్నట్టుగా తెలుస్తోంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ(Ravi Teja) ధమాక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా పెళ్లి సందడి ఫేమ్  శ్రీలీల అలరించనుంది. ఇక ఒక కీలకమైన పాత్ర కోసం మరో హీరో ఉంటే బాగుంటుందని అనుకున్నారట. అలా ఇటీవల కొంతమంది హీరోల పేర్లు వినిపించాయి. దాంతో వేణు పేరు గట్టిగా వినిపించింది.

వేణు(Venu) అయితే రీ ఎంట్రీ క్రేజ్ తో ఆడియన్స్ లో క్రేజ్ ను పెంచవచ్చు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇప్పటికీ వేణు అంటే ఉన్న క్రేజ్  ఏమాత్రం తగ్గలేదు. దాంతో వేణుని ఈ పాత్రకోసం దాదాపు ఫిక్స్ చేసినట్టే అంటున్నారు. మరి ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే .. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..