అత్యంత రహస్యంగా ప్రియుడిని పెళ్లాడిన తాప్సి.. ఉదయపూర్ లో ముగిసిన వివాహం, ఇంత సీక్రెట్ గా ఎందుకంటే

By tirumala ANFirst Published Mar 25, 2024, 2:16 PM IST
Highlights

స్టార్ బ్యూటీ తాప్సి అభిమానులకు సినీ వర్గాలకు స్వీట్ షాక్ ఇచ్చింది. చాలా కాలంగా తాప్సి.. మ్యాతీస్ అనే బ్యాట్మింటన్ ప్లేయర్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

స్టార్ బ్యూటీ తాప్సి అభిమానులకు సినీ వర్గాలకు స్వీట్ షాక్ ఇచ్చింది. చాలా కాలంగా తాప్సి.. మ్యాతీస్ అనే బ్యాట్మింటన్ ప్లేయర్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. కాగా సడెన్ గా మ్యాతీస్ ని వివాహం చేసేసుకుంది. 

మార్చి 23న వీళ్లిద్దరి పెళ్లి వేడుక ఉదయపూర్ లో జరిగింది. అత్యంత రహస్యంగా జరిగిన పెళ్లి వేడుకకి ఇరువురి కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. తాప్సి, మ్యాతీస్ వివాహం జరిగినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాప్సి చాలా తక్కువ సందర్భాల్లో తన ప్రియుడు మ్యాతీస్ తో కనిపించింది. 

వీళ్లిద్దరి పెళ్లి మూడు రోజుల వేడుకగా ఉదయ్ పూర్ లో జరిగిందట. మార్చి 20న సంబరాలు మొదలు కాగా.. 23న పెళ్లి జరిగింది. తాప్సి పెళ్ళికి హాజరైన సెలెబ్రిటీలు అతి కొద్దీ మంది మాత్రమే ఉన్నారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్, కనికా థిల్లాన్ లాంటి వారు మాత్రమే తాప్సి పెళ్ళికి హాజరయ్యారు. 

తప్పాడ్ చిత్రంలో తాప్సికి కోస్టార్ గా నటించిన పావైల్ గులాటి కూడా హాజరయ్యాడు. తాప్సి పెళ్లి జరుగుతున్న ప్రదేశం నుంచి అతడు ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అయింది. అసలు మేమెక్కడ ఉన్నామో మాకే ఐడియా లేదు అంటూ గులాటి పోస్ట్ చేశాడు. 

 

పెళ్లి రహస్యంగా చేసుకుంది కానీ త్వరలో తాప్సి ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుక నిర్వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని తాప్సి స్వయంగా ప్రకటించనుందట. తాప్సికీ, మ్యాతీస్ కి పెళ్లి వేడుక మీడియాలో రావడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ మ్యాటర్ ని గోప్యంగా ఉంచారు. మొత్తానికి తాప్సి 36 ఏళ్ళ వయసులో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 

click me!