దృశ్యం 2కి కొబ్బరి కాయ కొట్టిన వెంకీ మామ!

Published : Mar 02, 2021, 05:45 PM IST
దృశ్యం 2కి కొబ్బరి కాయ కొట్టిన వెంకీ మామ!

సారాంశం

2015లో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తుంది. దృశ్యం 2 మూవీలో కూడా వంకీకి జంటగా నటి మీనా నటిస్తున్నారు. దృశ్యం 2 మలయాళ వర్షన్ లో మోహన్ లాల్ నటించారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీనితో వెంకటేష్ రీమేక్ కి మొగ్గు చూపారు. 

విక్టరీ వెంకటేష్ మరో రీమేక్ కి సిద్ధం అవుతున్నారు. మలయాళ రీసెంట్ హిట్ దృశ్యం 2 చిత్రాన్ని ఆయన తెలుగులో అదే పేరుతో రీమేక్ చేయనున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన రాగా, నేడు పూజా కార్యక్రమాలతో షూటింగ్ లాంఛ్ చేశారు. ఈ లాంఛింగ్ ఈవెంట్ కి వెంకటేష్ తో పాటు నిర్మాత సురేష్ బాబు , దర్శకుడు జీతూ జోసెఫ్ మరియు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. 

2015లో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తుంది. దృశ్యం 2 మూవీలో కూడా వంకీకి జంటగా నటి మీనా నటిస్తున్నారు. దృశ్యం 2 మలయాళ వర్షన్ లో మోహన్ లాల్ నటించారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీనితో వెంకటేష్ రీమేక్ కి మొగ్గు చూపారు. 

మలయాళ వర్షన్ కి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ దృశ్యం 2 చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దృశ్యం 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో వైపు వెంకటేష్ నారప్ప మరియు ఎఫ్ 3 చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?