ఫుట్ బాల్ గ్రౌండ్ లో అజిత్, సర్జరీ తర్వాత మొదటిసారి కనిపించిన స్టార్ హీరో..

Published : Mar 12, 2024, 10:40 AM IST
ఫుట్ బాల్ గ్రౌండ్ లో అజిత్, సర్జరీ తర్వాత మొదటిసారి కనిపించిన స్టార్ హీరో..

సారాంశం

రీసెంట్ గా బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నాడు తమిళ స్టార్ హీరో అజిత్. సర్జరీ తరువాత చాలా ఫాస్ట్ గా కోలుకున్న ఆయన తాజాగా బయట కనిపించాడు.    

తమిళ సినీ ప్రపంచంలో.. స్టార్ గా ఎదిగాడు  తల అజిత్ . ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న అజిత్.  ప్రముఖ దర్శకుడి కూతురు తిరుమేణి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ షూటింగ్ జరుపుకున్న  అజర్‌ బైజాన్  దేశంలో ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. చాలా ఏళ్ల తర్వాత ప్రముఖ నటి త్రిష ఈ సినిమాలో అజిత్ సరసన నటిస్తోంది. 

ఈక్రమంలో సడెన్ గా అజిత్ హాస్పిటల్ పాలు అవ్వడం.. రెగ్యూలర్ చెకప్ లో భాగంగా హాస్పిటల్ కు వెళ్తే..  అజిత్ మెదడులో చిన్న ట్యూమర్ ఉందని తేలడం.. దాని కోసం అతను శస్త్రచికిత్స చేయబోతున్నాడని కొన్ని పుకార్లు వ్యాపించాయి. కానీ అతను సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్ళినట్లు తరువాత వెల్లడైంది. 

 

ఆ పరీక్షలో మెడలో వాపులు ఉన్నాయని, చిన్నపాటి చికిత్స చేయించుకున్నాడని మరో వాదన బయటకు వచ్చింది. అసలు సర్జరీ జరిగిందా లేదా అనేది అఫిషియలో గా బయటకు రాలేదు. కాని అజిత్ ట్రీట్మెంట్ మాత్రం చేయించుకున్నారు.  అదేవిధంగా ఆసుపత్రికి వెళ్లిన కొద్ది గంటల్లోనే  అజిత్ క్షేమంగా ఇంటికి తిరిగి రావడం ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకునేలా చేసింది.  

ఈక్రమంలో ఈ వార్తలు వైరల్ అవుతున్న టైమ్ లో.. అజిత్ బయటక కనిపించారు.  అజిత్ తన భార్య షాలిని, స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో దర్శనం ఇచ్చారు. హ్యాపీగావారితో మాట్లాడుతూ.. సరదాగా గడుపుతున్న టైమ్ లో.. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో శేర్ చేశారు. ప్రస్తుతం ఈ  వీడియో  ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు