
పావలా శ్యామల దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నారు. కామెడీ, క్యారెక్టర్ రోల్స్ చేశారు. ప్రస్తుతం ఒక అనాథగా కాలం వెళ్లదీస్తున్నారు. పావలా శ్యామల వృధాశ్రమంలో జీవిస్తున్నారు. ఒక టీవీ షోకి వచ్చిన శ్యామల తన వేదన వెళ్లగక్కారు. ఆమె మాటలు అందరి కళ్ళలో నీళ్లు తిరిగేలా చేశాయి. నాటకరంగంలో రాణించాను . ఎన్నో సత్కారాలు అందుకున్నాను. నాటకాలు తగ్గిపోవడంతో ప్రైజ్ లు అన్నీ అమ్ముకుని చిత్ర పరిశ్రకు వచ్చాను. నేను అందరు హీరోలతో నటించాను. కానీ నా నా పరిస్థితి ఇప్పుడు ఇలా తయారైంది. నా బ్రతుకు ఇలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు.
నా కష్టాలు, కన్నీళ్లు చెప్పుకోవడానికి మీ ముందు రాలేదు. మీ అందరిని ఒకసారి చూడాలి. మీ అభిమానం పొందాలని వచ్చాను. నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు. అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చాను, అన్నారు. పావలా శ్యామల గతంలో ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. అక్కడ తనను చూసుకునే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో అనాథాశ్రమానికి షిఫ్ట్ అయ్యారు. నడవలేని స్థితిలో ఉన్న పావలా శ్యామల వీల్ చైర్ లో షోకి వచ్చారు.
గతంలో కొందరు హీరోలు పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేశారు. అలాగే మనం ఫౌండేషన్ తరపున నటుడు కాదంబరి రూ. 25 వేలు ఆమెకు అందించారు. పావలా శ్యామల నాటకరంగం నుండి వచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, రవితేజ.. ఇలా అనేక మంది స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. పావలా శ్యామల నటించిన చివరి చిత్రం మత్తు వదలరా. 2019లో ఈ మూవీ విడుదలైంది.