అప్పుల్లో కూరుకుపోయిన స్టార్ హీరో.. అందుకే ఆ నిర్ణయం!

By Satish ReddyFirst Published May 18, 2020, 4:25 PM IST
Highlights

లాక్‌ డౌన్‌ ప్రకటించిన కొత్తలోనే తాను నిర్మించిన పొన్‌మగల్‌ వందాల్ సినిమాను ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు హీరో సూర్య. అయితే విషయంలో థియేటర్ల యజమానుల నుంచి సూర్యకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.

కరోనా లాక్‌ డౌన్ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. సినిమాల షూటింగ్‌లు ఆగిపోవటంతో పాటు రిలీజ్ లు కూడా వాయిదా పడటంతో నిర్మాతలు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. ఈ సమస్య చిన్న నిర్మాతల నుంచి స్టార్ ప్రొడ్యూసర్ల వరకు వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు నిర్మాతల రెడీగా ఉన్న సినిమాలను ఏదో ఒక రకంగా వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే కొందరు నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్‌గా ఓటీటీలలో రిలీజ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే ఒకటి రెండు చిన్న సినిమాలో ఓటీటీలో రిలీజ్ కాగా త్వరలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన సినిమాలను కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది హీరో సూర్య గురించి. సూర్య చాలా కాలం కిందటే ఈ నిర్ణయం తీసుకున్నాడు. లాక్‌ డౌన్‌ ప్రకటించిన కొత్తలోనే తాను నిర్మించిన పొన్‌మగల్‌ వందాల్ సినిమాను ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే విషయంలో థియేటర్ల యజమానుల నుంచి సూర్యకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.

ఒక దశలో సూర్య భవిష్యత్తులో నిర్మించే, నటించే సినిమాలేవీ థియేటర్లలో ప్రదర్శించమని కూడా వార్నింగ్ ఇచ్చారు థియేటర్ల యజమానులు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటించిన గులాబో సితాబొ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టుగా బిగ్‌ బీ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు వివిధ భాషల నుంచి మరిన్ని చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్య కూడా తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు.

అయితే ఈ విషయంలో సూర్య ఇబ్బందులను కూడా ప్రస్థావించాడు. నిర్మాతగా మారిన తాను ప్రస్తుతం భారీగా అప్పుల్లో ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపాడు. ప్రస్తుతం సూర్యకు 70 కోట్ల వరకు అప్పు ఉందట. ముఖ్యంగా పొన్‌మగల్ వందాల్ సినిమా కోసం చేసిన అప్పులు వెంటనే తీర్చాల్సి ఉంది. అందుకే తప్పని సరి పరిస్థితుల్లో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్ణయించామని క్లారిటీ ఇచ్చాడు సూర్య. మరి సూర్య విన్నపాన్ని థియేటర్ల యజమానులు ఎంత వరకు మన్నిస్తారనేది చూడాలి.

click me!