Suriya 'ET' Trailer: సైంటిస్ట్ కావాలనుకున్న వ్యక్తి ఇలా.. హైఓల్టేజ్ మాస్, కేక పెట్టిస్తున్న ట్రైలర్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 02, 2022, 12:47 PM ISTUpdated : Mar 02, 2022, 12:48 PM IST
Suriya 'ET' Trailer: సైంటిస్ట్ కావాలనుకున్న వ్యక్తి ఇలా.. హైఓల్టేజ్ మాస్, కేక పెట్టిస్తున్న ట్రైలర్

సారాంశం

హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌'(ET). పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత సూర్య మాస్ గెటప్ లో కనిపించబోతున్న చిత్రం ఇది. 

హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌'(ET). పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత సూర్య మాస్ గెటప్ లో కనిపించబోతున్న చిత్రం ఇది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భీకరంగా, ధైర్యంగా ఉండేవాడు అనే అర్థంవచ్చేలా టైటిల్ పెట్టారు. దీనితో సూర్య మాస్ విశ్వరూపం ఈ చిత్రంలో చూడొచ్చని అభిమానులు అంచనాలు పెట్టుకుని ఉన్నారు. 

అంచనాలకు తగ్గట్లుగానే ET ట్రైలర్ అదిరిపోయింది. సూర్య విభిన్న షేడ్స్ లో మాస్ యాక్షన్ తో అదరగొడుతున్నాడు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈటీ ట్రైలర్ లో విశేషాలు చూద్దాం. 'వాడేమో సైంటిస్ట్ కావాలని ఆశపడ్డాడు.. నేనేమో మరో విధంగా కావాలని ఆశపడ్డాను.. కానీ కాలము, దైవము వాడిని ఇలా చూడాలని ఆశపడ్డాయి' అని బ్యాగ్రౌండ్ లో డైలాగ్స్ వినిపిస్తుండగా సూర్య మాస్ ఎంట్రీ ఇస్తాడు. సూర్య గెటప్ పల్లెటూరి వ్యక్తి తరహాలో ఉంది. 

పంచె కట్టులో సూర్య స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అలాగే కొన్ని సన్నివేశాల్లో వైట్ షర్ట్, ప్యాంట్ ధరించి కనిపిస్తున్నాడు. మరి కొన్ని సీన్స్ లో సూర్య కత్తి పట్టుకుని శత్రువులని చెండాడే వాడిలా దర్శనం ఇస్తున్నాడు. సో ఈ మూవీలో సూర్య పాత్రలో డిఫెరెంట్ షేడ్స్ ఉన్నాయని ఫిక్స్ అయిపోవచ్చు. 

ట్రైలర్ మధ్యలో అమ్మాయిలని చంపే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అమ్మాలని చులకనగా చూసే విలన్స్ కనిపిస్తున్నారు. కోటు వేసుకునే జడ్జి వేరే.. పంచె ఎగ్గడితే నేనేరా జడ్జిని అంటూ సూర్య పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతున్నాడు. మొత్తంగా ఈటీ ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం బలమైన కథ తో రూపొందినట్లు తెలుస్తోంది. 

ట్రైలర్ లో యాక్షన్, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని షేడ్స్ సమపాళ్లలో కుదిరినట్లు అనిపిస్తున్నాయి. సూర్య తనదైన శైలిలో అదరగొట్టేస్తున్నాడు. మార్చి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.మార్చి 11న ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్ విడుదల కానుండడంతో పోటీ రసవత్తరంగా మారింది. 

సూర్య సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ట్రైలర్ లో ప్రియాంక లుక్స్ క్యూట్ గా ఉన్నాయి. సత్యరాజ్, శరణ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

నమ్రత ఎంత చెప్పినా వినకుండా డిజాస్టర్ చూసిన మహేష్ బాబు ? ఆ సినిమా చేసి తప్పు చేశాడా?
Eesha Rebba: డైరెక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్న ఈషా రెబ్బా.. అసలు కథ ఇప్పుడే స్టార్ట్