హీరో సుమంత్‌ రెండో పెళ్లి.. గర్ల్‌ఫ్రెండ్‌తో ?

Published : Jul 28, 2021, 01:49 PM ISTUpdated : Jul 28, 2021, 06:56 PM IST
హీరో సుమంత్‌ రెండో పెళ్లి.. గర్ల్‌ఫ్రెండ్‌తో ?

సారాంశం

అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి బాజా మోగనొంది. హీరో సుమంత్‌ రెండో పెళ్లికి సిద్దమయ్యారు. తాజాగా ఆయన వెడ్డింగ్‌ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

హీరో సుమంత్‌ రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఆయన పవిత్ర అనే అమ్మాయిని వివాహం చేసుకునేందుకు సిద్దమయ్యారట. త్వరలోనే వీరి మ్యారేజ్‌ జరగబోతుందని సమాచారం. తాజాగా సుమంత్‌ వెడ్డింగ్‌ కార్డ్ వైరల్‌ అవుతుంది. ఇందులో సుమంత్‌ కుమార్‌ వెడ్స్ పవిత్ర అని వెడ్డింగ్‌ కార్డ్ ఉంది. ఇది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వెడ్డింగ్‌ కార్డ్ రెడీ అయ్యిందంటే ఎంగేజ్‌మెంట్‌ కూడా పూర్తయ్యిందని  అర్థమవుతుంది. సీక్రెట్‌గా ఈ వ్యవహారాలను పూర్తి చేసినట్టు సమాచారం. 

అయితే ఇప్పటికే సుమంత్‌కి హీరోయిన్‌ కీర్తిరెడ్డితో వివాహం జరిగింది. 2004లో వీరి మ్యారేజ్‌ జరగగా, 2006లోనే విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థాలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. దాదాపు 15ఏళ్లుగా ఒంటరిగానే ఉన్నారు సుమంత్‌. ఎట్టకేలకు ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యారట. అయితే ఇప్పుడు తాను చేసుకునే అమ్మాయి పవిత్ర తన బంధువుల కూతురని తెలుస్తుంది. అదే సమయంలో లాంగ్‌ టైమ్‌ గర్ల్ ఫ్రెండ్‌ అనే వార్త కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. 

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్‌ `ప్రేమకథ`తో వెండితెరకు పరిచయమయ్యారు. `స్నేహమంటే ఇదేరా`, `సత్యం`, `గోదావరి`, `గోల్కోండ హైస్కూల్‌` చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం వరుస పరాజయాలు ఆయన్ని కోలుకోకుండా చేశాయి. మూడేళ్ల క్రితం`మళ్లీరావా` సక్సెస్‌తో పుంజుకున్నారు.  ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన `కపటధారి` మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా `అనగనగా ఒక రౌడీ`లో నటిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి