సమంత, విజయ్‌ సేతుపతిల సినిమా ఓటీటీలో..

Published : Jul 28, 2021, 12:43 PM IST
సమంత, విజయ్‌ సేతుపతిల సినిమా ఓటీటీలో..

సారాంశం

సమంత, విజయ్‌ సేతుపతి కలిసి నటించిన `సూపర్‌ డీలక్స్`  సినిమా తెలుగులో రిలీజ్‌ కానుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా`లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

స్టార్‌ హీరోయిన్‌ సమంత, విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి కలిసి నటించిన సినిమా ఓటీటీలో రాబోతుంది. సమంత, విజయ్‌ సేతపతి కలిసి తమిళంలో `సూపర్‌ డీలక్స్` అనే చిత్రంలో నటించారు. ఇందులో మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌, రమ్యకృష్ణ, మిస్కిన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇందులో విజయ్‌ సేతుపతి లేడీ గెటప్‌లో కనిపించడం విశేషం. త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. 

ఈ సినిమా తెలుగులో రిలీజ్‌ కానుంది.`ఆహా` ఓటీటీలో దీన్ని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఆగస్ట్ 6న స్ట్రీమింగ్‌ కానుందని ఆహా వెల్లడించింది. తమిళంలో సక్సెస్‌ అయిన ఈ సినిమా తెలుగులో, అది కూడా ఓటీటీలో ఎలాంటి ఆదరణపొందుతుందో చూడాలి. ఇక `ఉప్పెన` చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ సేతుపతి. మరోవైపు సమంత సైతం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. సినిమాపై ప్యాషన్‌, నటించాలనే కసికి పెళ్లి అడ్డు కాదని నిరూపిస్తుంది. ప్రస్తుతం సమంత తెలుగులో `శాకుంతలం` చిత్రంలో మెయిల్‌ లీడ్‌గా చేస్తుంది.తమిళంలో నయనతార, విజయ్‌ సేతుపతిలతో కలిసి `కాథువాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం
Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా