మహేష్‌ని ఎవరూ కొనలేరంటూ సుధీర్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Aug 29, 2021, 10:43 AM IST
మహేష్‌ని ఎవరూ కొనలేరంటూ సుధీర్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

హీరో సుధీర్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్‌ని ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. శనివారం ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో సుధీర్‌బాబు మాట్లాడుతూ, మంచి కంటెంట్‌ ఉన్న సినిమా తీశామని, ఇది రెగ్యూలర్‌ సినిమా కాదని మరోసారి గుర్తు చేశారు.

సుధీర్‌బాబు నటించిన `శ్రీదేవి సోడా సెంటర్‌` చిత్రానికి ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ వస్తోంది. ఈ సందర్భంగా హీరో సుధీర్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్‌ని ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. శనివారం ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో సుధీర్‌బాబు మాట్లాడుతూ, మంచి కంటెంట్‌ ఉన్న సినిమా తీశామని, ఇది రెగ్యూలర్‌ సినిమా కాదని మరోసారి గుర్తు చేశారు.

`శ్రీదేవి సోడా సెంటర్‌ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి సూరిబాబు, శ్రీదేవి పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటి వరకు సినిమా చూసిన వారెవ్వరూ బాగా లేదని చెప్పలేదు. సినిమా బాగుందని అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మహేష్, ప్రశాంత్ నీల్, రానా, నిహారిక కొణిదెల గార్లు సినిమా బాగుందని ట్వీట్ చేశారు. మహేష్ బాబు అనే వ్యక్తిని బెదిరించినా లేక రూ. 200 కోట్లు ఇచ్చినా కూడా తన కెరియర్‌లో తను నమ్మందే ఏది చేయడు. ఈ సినిమాకు తను పంపిన ట్వీట్‌లో ఎవరెవరు ఏం చేశారు అనేది క్లియర్‌గా చెప్పాడు. 

`ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. నచ్చితే పదిమందికి తెలియజేయండి. ఫ్యామిలీ అందరూ కలసి వచ్చి ఈ సినిమా చూడండి. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా మహిళలు చూడాల్సిన చిత్రమిది. సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు` అని తెలిపారు సుధీర్‌బాబు. సుధీర్‌బాబు, ఆనంది జంటగా `పలాస 1978` చిత్ర దర్శకుడు కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.  విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించగా, ఆగస్ట్‌ 27న ఇది విడుదలైంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే