‘లవ్ స్టోరీ ‘ నిర్మాత నిర్ణయంతో ... ‘సీటీమార్‌’ రిలీజ్ డేట్ ఛేంజ్

Surya Prakash   | Asianet News
Published : Aug 29, 2021, 09:26 AM IST
‘లవ్ స్టోరీ ‘ నిర్మాత నిర్ణయంతో ... ‘సీటీమార్‌’ రిలీజ్ డేట్ ఛేంజ్

సారాంశం

 గోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. సంపత్‌ నంది దర్శకత్వంలో క్రీడా నేపథ్యంగా ఈ చిత్రం రూపొందుతోంది.


గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘సీటీమార్’. తమన్నా హీరోయిన్. వేసవి కానుకగా రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. రీసెంట్ గా ఈ సినిమాని సెప్టెంబర్ 3న విడుదల చేయాలని డేట్ ఫిక్స్ చేసి ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర  టీమ్ వెల్లడించింది. అందుకు కారణం నాగచైతన్య లవ్ స్టోరీ వాయిదా పడటమే అని తెలుస్తోంది.

సెప్టెంబరు 10న విడుదల కావాల్సిన లవ్ స్టోరీ అక్టోబరుకి వాయిదా వేసినట్టు  సమాచారం. అక్టోబరు రెండోవారంలో దసరా కావడంతో  సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ 1న విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. దాంతో ఆ ప్లేస్ లోకి సీటీమార్ చిత్రం వచ్చి చేరింది.

ఇందులో గోపీచంద్‌, తమన్నా కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు. జ్వాలరెడ్డిగా తమన్నా తెలంగాణ జట్టు కోచ్‌గా కనిపించనుండగా, గోపీచంద్‌ ఆంధ్రా జట్టు కోచ్‌గా అలరించనున్నారు. గోపీచంద్‌ నుంచి కోరుకునే మాస్అంశాలతో పాటు, భావోద్వేగాలను కూడా జోడించారు.దిగంగన సూర్యవంశీ మరో హీరోయిన్. భూమిక ప్రధాన పాత్రలో నటిస్తోంది. పవన్‌ కుమార్‌ సమర్పణలో సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రానికి శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala తో వర్కౌట్‌ కాకపోవడంతో డీమాన్‌ పవన్‌ని పట్టుకుంది.. ట్రోల్స్ పై రీతూ చౌదరీ రియాక్షన్‌ ఇదే
BBK 12 Finale: బిగ్ బాస్ ప్రకటించకముందే విన్నర్ పేరు లీక్ చేసిన వికీపీడియా.. విజేత ఎవరో తెలుసా?