హీరో శ్రీకాంత్ పై మండిపడుతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్?

By Udayavani DhuliFirst Published Nov 30, 2018, 9:22 AM IST
Highlights

హీరో శ్రీకాంత్ కు ,మెగా ప్యామిలీకు ఉన్న అనుబంధం తెలియంది కాదు. చిరంజీవి ని అన్నయ్య అని పిలిచే శ్రీకాంత్ ఓ సినిమా కోసం చెప్పిన ఓ డైలాగ్ వారి కోపానికి కారణం అవుతోంది.

హీరో శ్రీకాంత్ కు ,మెగా ప్యామిలీకు ఉన్న అనుబంధం తెలియంది కాదు. చిరంజీవి ని అన్నయ్య అని పిలిచే శ్రీకాంత్ ఓ సినిమా కోసం చెప్పిన ఓ డైలాగ్ వారి కోపానికి కారణం అవుతోంది. ఈ విషయమై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే చిత్రంగా ఈ డైలాగు ఉన్న ట్రైలర్ చాలా కాలం క్రితమే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఎందుకు ఈ హడావిడి మొదలైందో తెలియాలి. 

ఇంతకీ ఆ డైలాగు ఏమిటంటే..`గాంధీ కడుపున గాంధీ పుట్టడు. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు. మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు. ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకురావాల్సిందే. వివిధ రూపాల్లో.. వివిధ పేర్లతో. సమ్ ఆర్ కమింగ్ అండ్ సమ్ ఆర్ గోయింగ్`. ఈ డైలాగులో మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు అనేది రామ్ చరణ్ ని ఉద్దేశించినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ చరణ్ మంచి సక్సెస్ అయ్యాడని..కాబట్టి అలాంటి డైలాగు పెట్టాల్సిన పనిలేదని అంటున్నారు. అందులో శ్రీకాంత్ హీరోగా నటించే సినిమాలో అలాంటివి పెట్టకుండా ఉంటే బాగుండేదని అంటున్నారు. ప్రాజెక్టు క్రేజ్ కోసమో, వివాదం కోసమో ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయకూడదని అంటున్నారు. 

ఈ డైలాగు...రాజకీయ నాయకుడి పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తున్న చిత్రం `ఆపరేషన్ 2019` లోనిది. `బివేర్ ఆఫ్ పబ్లిక్` అనే ట్యాగ్‌ లైన్ తో వస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బాబ్జీ రూపొందిస్తున్నారు. ఈ ఫిల్మ్ లో శ్రీకాంత్, మంచు మనోజ్, సునీల్‌, దీక్షా పంత్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.  అలివేలమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అలివేలు నిర్మించారు. చాలా కాలంగా సోలో హీరోగా విజయాలు లేని శ్రీకాంత్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే సినిమా విడుదల కానుంది

click me!