హీరో శ్రీవిష్ణు కారుని అడ్డుకుని మరీ నిలదీసిన కూలీలు..యాగంటిలో సంఘటన, గొడవ ఏంటంటే

By tirumala ANFirst Published Jan 3, 2024, 10:02 AM IST
Highlights

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. దీనితో శ్రీవిష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫన్నీ రాబరీ కథలు, అలాగే కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. దీనితో శ్రీవిష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫన్నీ రాబరీ కథలు, అలాగే కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు.  గత ఏడాది శ్రీవిష్ణు 'సామజవరగమన' చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. 

ప్రస్తుతం శ్రీవిష్ణు, యంగ్ బ్యూటీ రీతూ వర్మ జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ లో ఊహించని సమస్య ఏర్పడింది. అది కాస్త శ్రీవిష్ణు మెడకు చుట్టుకుంది. పోలీసులు రంగంలోకి దిగితే కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బనగానెపల్లిక్షేత్రంలో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ జరుగుతోంది. 

Latest Videos

షూటింగ్ కోసం దాదాపు 400 వందల మంది కూలీలు అవసరం అయ్యారు. చిత్ర బృందం కూలీలని తీసుకువచ్చి షూటింగ్ చేశారు. అయితే వారికి ఇవ్వాల్సిన వేతనం విషయంలో జాప్యం జరిగింది. తమతో షూటింగ్ చేయించుకుని ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇలా పడిగాపులు కాచేలా చేస్తారా అంటూ 400 మంది షూటింగ్ లొకేషన్ లోనే ఆందోళనకి దిగారు. 

చిత్ర యూనిట్ స్పందించకపోవడంతో అప్పుడే షూటింగ్ నుంచి వెళుతున్న హీరో శ్రీవిష్ణు కారుని ముట్టడించారు. తమ వేతనం ఏదని నిలదీసారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మీకు రావాల్సిన వేతనానికి, హీరోకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు వారికి నచ్చజెప్పారు. దీనితో కూలీలు శ్రీవిష్ణు కారుని పోనిచ్చారు. కొంతసేపటికి వారి వేతన సమస్య కూడా పరిష్కారం అయ్యింది. 

శ్రీవిష్ణు, రీతూ వర్మ తొలిసారి కలసి నటిస్తున్న చిత్రం ఇది. సైలెంట్ గా వచ్చి హిట్స్ కొడుతున్న శ్రీ విష్ణు తన కొత్త చిత్రానికి సంబందించిన వివరాలని ఇంకా తెలియజేయలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. 

click me!