మా హీరో `బంగారం` అనిపించుకున్న తమిళ స్టార్‌ శింబు

Published : Nov 08, 2020, 11:56 AM IST
మా హీరో `బంగారం` అనిపించుకున్న తమిళ స్టార్‌ శింబు

సారాంశం

తమిళ స్టార్‌ శింబు నిజంగానే బంగారం అనిపించుకున్నారు. తన చిత్ర యూనిట్‌ చేత బంగారం అనిపించుకున్నారు. మరి బంగారం అనిపించుకునేంత పని ఏం చేశాడో తెలిస్తే మాత్రం నిజంగానే బంగారం అనక మానరు. 

సినిమాల్లో మంచి పని చేసి హీరో బంగారం అనిపించుకోవడం సర్వసాధారణమే. కానీ రియల్‌ లైఫ్‌లో అలా అనిపించుకోవడానికి గొప్ప హృదయం కావాలి. ఎంతో సేవా గుణం ఉండాలి. ప్రస్తుతం తమిళ స్టార్‌ శింబు నిజంగానే బంగారం అనిపించుకున్నారు. తన చిత్ర యూనిట్‌ చేత బంగారం అనిపించుకున్నారు. మరి బంగారం అనిపించుకునేంత పని ఏం చేశాడో తెలిస్తే మాత్రం నిజంగానే బంగారం అనక మానరు. 

ప్రస్తుతం శింబు `ఈశ్వరన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల  చేసిన ఫస్ట్ లుక్‌ ఆకట్టుకుంటుంది. మెడలో నాగుపాముతో, చేతిలో బ్యాట్‌తో ఉన్న లుక్‌లు సినిపై ఆసక్తిని పెంచాయి. సుశీంద్రన్‌ దర్శకత్వంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శింబు తన చిత్ర యూనిట్‌కి బంగారు నాణేలు పంచారు. ఒక్కొక్కరి ఒక్కో గ్రామ్‌ బంగారం చొప్పున నాలుగు వందల మందికి పంచిపెట్టారు. బంగారంతోపాటు వారికి జత బట్టలు పెట్టారు.

 మరో రెండు వందల మందికి బట్టలు పంపిణి చేశారు. దీంతో వారంతా శింబు నిజంగానే బంగారం అంటున్నారు.  ఈ సినిమా కోసం ఆయన ముప్పై కేజీలు తగ్గడం విశేషం. త్వరలోనే ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమాని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..