నయనతార ఫోటోలు నేను లీక్ చేయలేదు.. స్టార్ హీరో రెస్పాన్స్!

Published : Aug 16, 2018, 04:39 PM ISTUpdated : Sep 09, 2018, 01:35 PM IST
నయనతార ఫోటోలు నేను లీక్ చేయలేదు.. స్టార్ హీరో రెస్పాన్స్!

సారాంశం

నయనతార నాతో ఉన్న ఫోటోలు నేను లీక్ చేయలేదు. ఆ ఫోటోలు నిజమైనవి మార్ఫింగ్ చేయలేదు. మేమిద్దరం దుబాయ్ వెళ్లినప్పుడు ఆ ఫోటోలు తీసుకున్నాం

తమిళ హీరో శింబుతో కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్ మైంటైన్ చేసింది హీరోయిన్ నయనతార. అప్పట్లో వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటించారు. బ్రేకప్ అయిన తరువాత కూడా కలిసి నటించడం విశేషం. శింబుతో తన ప్రేమను నయన్ పెళ్లి వరకు తీసుకెళ్తుందని అనుకున్నారు కానీ మధ్యలోనే వీరి బంధానికి గుడ్ బై చెప్పేశారు. ఆ తరువాత నయన్.. ప్రభుదేవాని ప్రేమించడం అది కూడా బ్రేకప్ అవ్వడం జరిగిపోయాయి.

అయితే శింబుతో నయన్ క్లోజ్ గా ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి. ఇద్దరి లిప్ లాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పట్లో శింబు కావాలనే ఫోటోలు లీక్ చేశాడనే వార్తలు వినిపించాయి. కొంతకాలానికి ఈ వివాదం కాస్త సద్దుమణిగిపోయింది. అయితే ఇప్పుడు శింబు ఈ లీకైన ఫోటోల మీద స్పందించడం విశేషం. 'నయనతార నాతో ఉన్న ఫోటోలు నేను లీక్ చేయలేదు. ఆ ఫోటోలు నిజమైనవి మార్ఫింగ్ చేయలేదు. మేమిద్దరం దుబాయ్ వెళ్లినప్పుడు ఆ ఫోటోలు తీసుకున్నాం.

అక్కడే ఓ కెమెరా తీసుకొని దాంతోనే ఫోటోలు తీసుకున్నాం. కానీ అనుకోని విధంగా ఆ కెమెరా మరొకరి చేతుల్లోకి వెళ్లింది. అలా ఫోటోలు లీకై ఉంటాయి. అంతే తప్ప కావాలని నేను ఆ ఫోటోలు లీక్ చేయలేదు. దాని వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయి. నేను ఏ అమ్మాయి జీవితంతో ఆదుకోలేదు. అనుమతి లేకుండా ఏ అమ్మాయి మీద చేయి వేయలేదు' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నయన్ ఈ సంగతులన్నీ మర్చిపోయి విజ్ఞేశ్ శివన్ ప్రేమలో మునిగిలేతేలుతుంది. 

PREV
click me!

Recommended Stories

Rachita Ram: బాడీ షేమింగ్ కామెంట్స్ పై కూలీ నటి స్ట్రాంగ్ రియాక్షన్, అలాంటి వాళ్ళు నిజంగా మూర్ఖులే
Malavika Mohanan: డైలాగ్స్ చెప్పమంటే ఏబీసీడీలు చదువుతారు.. హీరోయిన్లపై రాజాసాబ్ బ్యూటీ కామెంట్స్