పూరీ జగన్నాథ్ సినిమా కోసం 16 కేజీలు తగ్గాను, సత్యదేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

By Mahesh JujjuriFirst Published Dec 12, 2022, 5:55 PM IST
Highlights

తన కెరీర్ లో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు వెర్సిటైల్ యాక్టర్ సత్యదేవ్. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న సత్యదేవ్ ... పూరీ జగన్నాథ్ సినిమా గురించి కొన్ని షాకింగ్ విషయాలు పంచుకున్నారు సత్యదేవ్. 

తన కెరీర్ లో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు వెర్సిటైల్ యాక్టర్ సత్యదేవ్. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న సత్యదేవ్ ... పూరీ జగన్నాథ్ సినిమా గురించి కొన్ని షాకింగ్ విషయాలు పంచుకున్నారు సత్యదేవ్. 

టాలీవుడ్  హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్  సత్యదేవ్ తన ఫిల్మ్ కెరీర్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆయన తనకు సినిమా ఛాన్స్ లు ఎలా వచ్చాయో.. తనకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది..? సినిమా కోసం తాను చేసిన రిస్క్ ల గురించి వివరంగా చెప్పాడు. తన కెరియర్ గురించి ఆయన మాట్లాడుతూ ..సినిమాల పట్ల ఇంట్రెస్ట్ తో ఉన్న జాబ్ ను కూడా మానేసి  ఇండస్ట్రీ వైపు వచచేశాను అన్నారు సత్యదేవ్.  

చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసి పట్టుదలతో సినిమాల కోసం కృషి చేశానననాడు  సత్యదేవ్. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ను చేస్తూ వెళ్లాను. అలాంటి పరిస్థితుల్లోనే పూరి 'జ్యోతి లక్ష్మి' సినిమా ఆడిషన్స్ కి వెళ్లాను. పూరిగారి సినిమాల్లో చేయడానికి హీరోలంతా రెడీగా ఉంటారు. కనుక విలన్ రోల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని అనుకున్నాను. అయితే పూరీకి నా ఆడిషన్ నచ్చింది. కాని తాను అప్పటికే 90 కేజీలు ఉండటంతో  బరువు తగ్గాలని ఆయన అన్నారు. 

ఈ సినిమాలో విలన్ కాస్త హ్యాండ్సమ్ గా ఉంటాడేమో అనుకుని.. అప్పటి నుంచ ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు.  బరువు తగ్గడం పైనే దృష్టి పెట్టాను. అలా 16 కేజీల వరకూ బరువు తగ్గాను. ఆ తరువాత వెళ్లి ఆయనకి కనిపిస్తే వెంటనే గుర్తుపట్టలేదు. ఆ తరువాత 'ఇదేంటి పేషంట్ మాదిరిగా తయారవ్వు?' అన్నారు. అలా పూరీకే షాక్ ఇచ్చాను. అయితే అప్పుడే ఆయన నాకు షాకింగ్ న్యూస్ చెప్పారు. 

పూరీ చెప్పారు ఆయన ఈ సినిమాలో నేనే హీరో అని. అందువలన కొంచెం బరువు పెరగమని అన్నారు. అలా పూరి గారి దగ్గరికి విలన్ వేషాల కోసం వెళ్లిన నేను హీరోను అయ్యాను. సూపర్ యాక్షన్ ఫిల్మ్స్ చేసిన పూరీ జగన్నాథ్ జ్యోతిలక్ష్మి  చేయడం .. అందులో హీరో కావడం  నా అదృష్టమనే చెప్పాలి. అదే నాకు నాకు బాగా  కలిసొచ్చింది. అయితే జ్యోతి లక్ష్మీ సినిమా ఎలా ఉన్నా. ఈ సినిమా వల్ల నా పాత్రకు బాగా పేరు వచ్చింది. ఈ సినిమాతో అవకాశాలు కూడా భాగా వచ్చాయంటూ.. పూరీ ని మర్చిపోలేన్నారు సత్యదేవ్. రీసెంట్ గా గాడ్ ఫాదర్ మూవీలో సత్యదేవ్  విలన్ గా నటించి మెప్పించారు. ఈ సినిమాతో ఆయన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. 
 

click me!