#Balakrishna:డైనమిక్ 'సీఎం' గా బాలయ్య ? చంద్రబాబుని గుర్తు చేస్తూ

By Surya PrakashFirst Published Dec 12, 2022, 5:52 PM IST
Highlights

బాలయ్య క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆయన బావ చంద్రబాబు నాయుడు ..సీఎం గా చేస్తూండగా చేసిన పాలను ను దృష్టిలో పెట్టుకుని ఈ క్యారక్టర్ డిజైన్ చేసారంటున్నారు.  


బాలకృష్ణ  ఫ్యాన్స్ ని ఆనందపరిచే వార్త ఇది. బాలయ్య త్వరలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.  ఆ పాత్ర చాలా డైనమిక్ గా ఉంటుందని, ప్రజలకు మేలు చేయటమే కాకుండా తన రాజకీయ శత్రులను ఓ రేంజిలో అల్లాడించబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు డైలాగులో ఓ వెర్షన్ ని రీసెంట్ గా బాలయ్య విన్నారని తెలుస్తోంది. ఇంతకీ దర్శకుడు ఎవరంటారా.. 

పరుశురామ్ తన తర్వాత సినిమాని బాలయ్య బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా బాలయ్య – పరుశురామ్ సినిమాకి సంబంధించి ఓ లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సీఎం గా కనిపించబోతున్నాడట. బాలయ్య క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆయన బావ చంద్రబాబు నాయుడు ..సీఎం గా చేస్తూండగా చేసిన పాలను ను దృష్టిలో పెట్టుకుని ఈ క్యారక్టర్ డిజైన్ చేసారంటున్నారు.  బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా తర్వాత.. పరుశురామ్, బాలయ్య సినిమా స్టార్ట్ కానుంది. 

ఇప్పటిదాకా  పరశురామ్ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది, పూర్తిస్థాయి మాస్ సినిమా అయితే తీయలేదు. మహేశ్ బాబుతో చేసిన సినిమాలో ఫైట్లు ఉన్నా, అందులో క్లాస్ టచ్ ఎక్కువ ఉందనే కామెంట్లే వినిపించాయి. మరి, బాలయ్య కోసం ఎలాంటి కథని సిద్ధం చేశాడో చూడాలంటున్నారు అభిమానులు. కాగా.. ప్రస్తుతం బాలయ్య చేస్తోన్న ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో బాలయ్య సరసన శ్రుతిహాసన్  హీరోయిన్ గా నటించగా.. కన్నడ నటుడు దునియా విజయ్, తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్‌గా ఇది రూపొందింది కాబట్టి, ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

click me!