
సాయి ధరమ్ తేజ్ చాలా కాలం అనంతరం మీడియా ముందుకు వచ్చారు. 2021లో ఆయనకు ప్రమాదం జరిగింది. కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. పూర్తిగా రికవరీ అయ్యాక విరూపాక్ష చిత్రం చేశారు. ఏప్రిల్ 21న విరూపాక్ష వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ భాగంగా సాయి ధరమ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా టీనేజ్ నుండి తాను ఇష్టపడిన అమ్మాయిలు, వాళ్లతో లవ్ స్టోరీస్ గురించి చెబుతూ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. మొదట్లో మేము బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత ప్రేమికులమయ్యాం. డిగ్రీలో ఆ అమ్మాయికి దగ్గరుండి వివాహం చేశాను. ఎందుకంటే అప్పుడు డిగ్రీ తప్ప నా దగ్గర ఏమీ లేదు. అందుకే నా పేమను త్యాగం చేశాను. సమంత ఒక వ్యక్తిగా నన్ను అట్రాక్ చేసింది. కెరీర్ బిగినింగ్ లో నా పక్కన హీరోయిన్స్ గా నటించిన సయామీ ఖేర్, రెజీనా కాసాండ్రా అన్న కూడా చాలా ఇష్టం.
సినిమాల్లోకి వచ్చాక తిక్క మూవీ హీరోయిన్ లారిస్సా బోనేసి ని చూడగానే పడిపోయాను. ఆమెను ప్రేమించాను. ఒకరోజు నువ్వంటే ఇష్టం. డేటింగ్ చేద్దామా అని అడిగాను. సారీ తేజ్ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. ఆమె సమాధానానికి నా గుండె బద్దలైందని... సాయి ధరమ్ చెప్పుకొచ్చారు. ఒక హీరోయిన్ ని ప్రేమించానని సాయి ధరమ్ తేజ్ ఓపెన్ గా చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇక విరూపాక్ష విషయానికి వస్తే... థ్రిల్లర్ జోనర్లో కొత్త దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించారు. కథను సుకుమార్ అందించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు. ట్రైలర్ ఆకట్టుకోగా మూవీ మీద అంచనాలు పెరిగాయి. ప్రతిరోజూ పండగే అనంతరం సాయి ధరమ్ తేజ్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. విరూపాక్ష చిత్రం మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు.