స్టార్ హీరోయిన్ కి రానా క్షమాపణలు... ఇంతకీ ఏం జరిగిందంటే!

Published : Aug 15, 2023, 02:11 PM ISTUpdated : Aug 15, 2023, 02:17 PM IST
స్టార్ హీరోయిన్ కి రానా క్షమాపణలు... ఇంతకీ ఏం జరిగిందంటే!

సారాంశం

కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం. హీరో దుల్కర్ సల్మాన్ ని పొగిడే క్రమంలో రానా చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు.   

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కి హీరో రానా క్షమాపణలు చెప్పారు. ఆమెకు క్రమశిక్షణ లేదన్నట్లు రానా మాట్లాడటం వివాదాస్పదమైంది. దుల్కర్ సల్మాన్ ని పొగిడే క్రమంలో రానా సోనమ్ కపూర్ ని కించపరుస్తూ మాట్లాడారు. ఆయన పేరు చెప్పుకున్నప్పటికీ సోనమ్ ట్రోల్ల్స్ కి గురైంది. దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కొత్త ఆగష్టు 24న విడుదల కానుంది. దీంతో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.  అతిథిగా రానా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ... దుల్కర్ చాలా సహనపరుడు. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. అలాంటి దుల్కర్ వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయడమంటే నాకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది. గతంలో దుల్కర్ సల్మాన్ చేసిన ఓ బాలీవుడ్ మూవీ నిర్మాతలు నా ఫ్రెండ్స్. ఆ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంటే నేను సెట్స్ కి వెళ్ళాను. ఆ చిత్రంలో నటిస్తున్న ఓ బాలీవుడ్ బడా హీరోయిన్ షాపింగ్ గురించి భర్తతో ఫోన్లో మాట్లాడుతూ దుల్కర్ ని వెయిట్ చేయించింది. 

టేకుల మీద టేకులు తీసుకుంటూ మధ్యలో ఫోన్స్ మాట్లాడుతున్నా దుల్కర్ ఎండలో సహనంగా ఎదురు చూశాడు. చివరికి నా సహనం కూడా నటించింది. దుల్కర్ మాత్రం కామ్ గా ఉన్నారని చెప్పుకొచ్చాడు. దీంతో సోనమ్ కపూర్ కి  పొగరు అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో రానా స్పందించారు . తన కామెంట్స్ కారణంగా ఆమెను ట్రోల్ చేయడం బాధించింది అన్నారు. 

ట్విట్టర్ వేదికగా రానా సోనమ్ కపూర్ తో పాటు దుల్కర్ కి క్షమాపణలు చెప్పారు. సోనమ్ నాకు ఫ్రెండ్. ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటాం. నా కామెంట్స్ తప్పుగా ప్రోజెక్ట్ అయ్యాయి. దాంతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నా వ్యాఖ్యల ఉద్దేశం అది కాదు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని కామెంట్ చేశారు. రానా ఒక హీరోయిన్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మరోవైపు రానా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. ఇటీవల హిరణ్యకశిప టైటిల్ తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి రచయితగా పనిచేయనున్నారు . 
 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే