భారత పౌరసత్వం పొందిన అక్షయ్ కుమార్..స్వాతంత్ర దినోత్సవం రోజు స్యయంగా ప్రకటించిన హీరో..

Published : Aug 15, 2023, 01:20 PM IST
భారత పౌరసత్వం పొందిన అక్షయ్ కుమార్..స్వాతంత్ర దినోత్సవం రోజు స్యయంగా ప్రకటించిన హీరో..

సారాంశం

ఎట్టకేలకు ఇండియన్ గా మారాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. కెనడియన్ సిటిజన్ షిప్ వల్ల  ఈ హీరో ఎన్నో విమర్షలు ఎదుర్కొన్నాడు.. ఈక్రమంలో తాజాగా ఆయన చేసిన ప్రకటనతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.   

చాలా కాలంగా బాలీవుడ్ స్టార్ హీరోను వెంటాడుతున్న సమస్య.. అతను కెనడియన్ గా కొనసాగడం. అక్షయ్ కుమార్  కెనడియన్.  ఆ సిటిజన్ షిప్ కోరిమరీ తెచ్చుకున్నాడు. ఆయనకు అక్కడి దేశ పౌరసత్వం ఉంది.. కాని ఇండియన్ సిటిజన్ గా మాత్రం పరిగణించలేదు . దాంతో తాజాగా అక్షయ్ కుమార్ తన  పాస్‌పోర్ట్‌ను వదులుకున్నాడు మరియు ఎట్టకేలకు తన భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాడు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ స్వంగా ప్రకటించాడు. 

భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ట్విట్టర్‌లో అక్షయ్ ఇలా రాశాడు, "దిల్ ఔర్ పౌరసత్వం, దోనో హిందుస్తానీ. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ అంట రాసుకోచ్చాడు. కెనడా పౌరసత్వం వల్ల ఇండియాలో చాలా విమర్షలు ఎదుర్కొన్నాడు అక్షయ్ కుమార్. గతంలో ఆయనపై చాలా విమర్షలు వచ్చాయి. 

 

దాంతో ఆయన కెనడియన్ పౌరసత్వాన్ని వదులుకున్నాడు. ఇండియన్ పాస్ పోర్ట్ కోసం కొంత కాలం క్రితం ధరఖాస్తు చేసుకున్నారు. అంతే కాదు గతంలో తాను ఎందుకు కెనడియన్ పౌరసత్వం తీసుకోవలసి వచ్చిదో కూడా ఓ సారి ఇంటర్వ్యూల్ వివరించాడు అక్షయ్. 90స్ లో తన కెరీర్ ధారుణంగా ఉన్న టైమ్ లో .. తనస్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లాలి అనుకున్నాడట అక్షయ్. దానికోసమే అతను కెనడియన్ గా మారిపోయాడు. ఎట్టకేలకు ఆ పాస్ పోర్ట్ వదులుకుని హాట్ న్యూస్ అవుతున్నాడు. 

అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ సీనియర్ హీరోగా కొనసాగుతున్నాడు. బాలీవుడ్ నుంచి 100 కోట్ల  రెమ్యూనరేషన్ హీరోగా ఘనత సాధించాడు. అంతే కాదు ఆదానీలను.. అంబానిలను మించి.. ఏడాదికి 26 కోట్లకు పైగా ప్రభుత్వానికి టాక్స్ లు చెల్లించి వార్తల్లో నిలిచాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సిమాలు సెట్స్ ఎక్కిస్తూ.. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ.. గెలుపోటములు లెక్క చేయకుండా.. దూసుకుపోతున్నాడు అక్షయ్ కుమార్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా