‘రానా నాయుడు’పై వ్యతిరేకత.. సారీ చెప్పిన యంగ్ హీరో రానా.!

By Asianet News  |  First Published Mar 12, 2023, 5:06 PM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన ’రానా నాయుడు‘ వెబ్ సిరీస్ పై ఎంతటి రెస్పాన్స్ వస్తుందో.. అంతే వ్యతిరేకతకూ గురవుతోంది.


దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి విక్టరీ వెంకటేశ్ (Venkatesh),  రానా దగ్గుబాటి (Rana Daggubati)  కలిసి మొట్టమొదటి సారిగా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో నటించారు. ఎప్పటి నుంచే అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సిరీస్ రెండ్రోజుల కింద నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం మంచి రెస్పాన్స్ తో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సీరిస్ లకు సెన్సార్స్ నిబంధలు పెద్దగా వర్తింకపోవడంతో దర్శకుడికి బాగా ఫ్రీడమ్ ఉంటుంది. దీంతో బూతు పదాలు,  క్రైమ్ సీన్స్ వంటి వాటిని వాడుకునే ఛాన్స్ ఉంటుంది.

ఈ క్రమంలో Rana Naidu వెబ్ సిరీస్ లోనూ  బూతు పదాలు వాడటంతో ఫ్యాన్స్ మాత్రం హార్ట్ అవుతున్నారు. పైగా వెంకటేశ్ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో ఇలాంటి సిరీస్ లో నటించడం పట్ల ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ట్రోల్స్ కూడా వస్తున్నాయి.  సిరీస్ మొత్తంలో ఊహించని స్థాయిలో బూతు పదాలు వాడారని, 18 ఏండ్లు పైబడిన వారే చూడాలంటూ సిరీస్ చూసిన వారు అభిప్రాయపడుతున్నారు.  దీనిపై తాజాగా రానా దగ్గుబాటి  సైతం స్పందంచారు.ఫ్యాన్స్ ట్వీట్లకు రిప్లై ఇస్తూ వచ్చారు. 

Latest Videos

ఈ క్రమంలో ఫ్యాన్స్ కు, ఆడియెన్స్ కు రానా క్షమాపణలు కోరారు.  సిరీస్ ను మెచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే  నచ్చని వారికి తన హ్రుదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేశారు. ఏదేమైనా ఈసిరీస్ టాప్ 10లో నెంబర్ స్థానంలో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సీరిస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. హాలీవుడ్ ‘రే డోనోవన్’ సిరీస్ కు రీమేక్ గా రూపుదిద్దుకుంది. కరణ్ అన్షమన్, సుప్రన్ ఎస్ వర్మ దర్శకత్వం వహించారు. ఇక ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ హిట్ సిరీస్ దర్శఖుడు శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘సైంధవ్  చిత్రంలో నటించబోతున్నారు.  ఇప్పటికే విడుదలైన టైటిల్  పోస్టర్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. 

 

Thank you for so much love ❤️❤️❤️ My sincere apologies to the ones who hate 🤗🤗 pic.twitter.com/dUx6MpK8uE

— Rana Daggubati (@RanaDaggubati)
click me!