అభిమాని ట్వీట్ కి రామ్ ఘాటు రిప్లై!

Published : Dec 08, 2018, 08:45 AM IST
అభిమాని ట్వీట్ కి రామ్ ఘాటు రిప్లై!

సారాంశం

తెలంగాణాలో 119 శాసనసభా నియోజక వర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. నిన్న పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

తెలంగాణాలో 119 శాసనసభా నియోజక వర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. నిన్న పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

అధిక శాతం ఓటింగ్ జరిగింది. ఈ క్రమంలో సెలబ్రిటీలు సిరా చూపిస్తూ దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను కూడా ఓటు వేయాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో హీరో రామ్ కూడా సెల్ఫీని పోస్ట్ చేస్తూ.. 'నాది నాదే.. మరి మీది..?' అని ప్రశ్నించారు.

దీనికి ఓ అభిమాని 'మాది ఆంద్రలే' అని బదులిచ్చాడు. ఇది చూసిన రామ్.. 'అదీ మనదే తమ్ముడు.. ఒక్క ముఖ్యమంత్రి సరిపోలేదని ఇద్దరికి ఇచ్చాం అంతే.. విడదీసి ఇచ్చాం.. విడిపోలేదు. రెండు మనవే' అంటూ సమాధానమిచ్చాడు.

రామ్ జవాబుకి ఫిదా అయిన నెటిజన్లు కరెక్ట్ గా చెప్పారంటూ ఆయనను మెచ్చుకున్నారు. ఆంధ్ర, తెలంగాణా ఏంటి.. రెండు మనవే అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?
Dhanush: కొడుకులే బాడీగార్డ్స్.. యాత్ర, లింగాలతో కలిసి పళని మురుగన్ గుడికి ధనుష్