మీడియాకి అర్ధరాత్రి ఫోన్ రావొచ్చు.. రామ్ వ్యాఖ్యలు!

By Udayavani DhuliFirst Published Oct 1, 2018, 11:00 AM IST
Highlights

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం 'హలో గురు ప్రేమకోసమే' సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమాను విడుదల చేయనున్నారు. 

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం 'హలో గురు ప్రేమకోసమే' సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. 

దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమాను విడుదల చేయనున్నారు. ప్రేమ కోసం ఓ కుర్రాడు ఏం చేశాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలో తెలియక సతమతమయ్యే అబ్బాయిలకు రామ్ ఓ సలహా ఇస్తున్నాడు. ''వీడు పెళ్లి చేసుకుంటే చాలురా బాబు'' అనుకునే టైమ్ లో ఏ అమ్మాయిని తీసుకువెళ్లినా.. ఇంతలు వాళ్లు ఓకే చేసేస్తారని రామ్ అన్నారు.

తను కూడా అలానే చేస్తాడా..? అంటే చెప్పలేదు కానీ ఇప్పటివరకు ఏ అమ్మాయి నచ్చలేదని తెలిపారు. తనకు నచ్చే విధంగా ఇప్పతివరకు ఏ అమ్మాయి కనిపించలేదని అన్నారు. ఎవరైనా అమ్మాయి నచ్చితే మాత్రం ఓ అర్ధరాత్రి రామ్ కి నిశ్చితార్ధం అయిపోయిందని మీడియాకి ఫోన్ రావొచ్చని రామ్ తెలిపారు.

గతంలో రామ్ కి రకుల్ ప్రీత్ తో ఎంగేజ్మెంట్ అయిందనే వార్తలు వినిపించాయి. వీటిని ఖండించిన రామ్ అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారో అర్ధం కాదని అన్నారు. 

click me!