ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో రామ్!

Published : Jul 19, 2019, 05:11 PM IST
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో రామ్!

సారాంశం

హీరో రామ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మాస్ హిట్ అందుకున్నాడు. జులై 18న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ బి, సి సెంటర్స్ లో తిరుగులేని ప్రదర్శన కనబరుస్తోంది. 

హీరో రామ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మాస్ హిట్ అందుకున్నాడు. జులై 18న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ బి, సి సెంటర్స్ లో తిరుగులేని ప్రదర్శన కనబరుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లాభాల విషయంలో ఘన విజయం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

ఇస్మార్ట్ శంకర్ విజయంతో హీరో రామ్ తాను గతంలో అభిమానులకు ఇచ్చిన మాటని గుర్తుచేసుకున్నాడు. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హలో గురు ప్రేమ కోసమే చిత్రం గత ఏడాది విడుదలై పర్వాలేదనిపించింది. ఆ సమయంలో రామ్ ఓ ట్వీట్ చేశాడు. అంతగా సంతృప్తికరంగా లేకపోయినా హాలోగురు ప్రేమ కోసమే చిత్రాన్ని హిట్ చేశారు. ఈ సారి వడ్డీతో సహా మీ రుణం తీర్చుకుంటా అని ఫ్యాన్స్ ఉద్దేశించి రామ్ వ్యాఖ్యలు చేశాడు. 

ఆ మాటలని గుర్తు చేసుకుంటూ రామ్ తాజాగా మరో ట్వీట్ చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం ఇస్మార్ట్ శంకర్ చిత్రం విజయం సాధించింది. 'అయినా సరిపోదు.. మీకు ఇంకా చాలా రుణపడి ఉన్నా' అని రామ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. 

 

PREV
click me!

Recommended Stories

అఖండ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్, బాలయ్యకు భారీ షాక్, గతవారం రిలీజైన 6 సినిమాల రిపోర్ట్ సంగతేంటి?
Bigg Boss 9 Telugu: తనూజ చరిత్ర మాకు తెలుసు, కళ్యాణ్ ని గెలిపించండి.. యష్మీ, శ్రీసత్య షాకింగ్ కామెంట్స్