NTR: నా ఇంటర్నేషనల్ ట్రిప్ లో బెస్ట్ ఇండియన్ ఫుడ్..!

By Sambi ReddyFirst Published Dec 26, 2022, 11:37 AM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ హోటల్ లో లభించిన ఇండియన్ ఫుడ్ టేస్ట్ కి మైమరచిపోయాడు. టేస్ట్ అద్భుతం అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. 
 

ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్, భార్గవ్ లతో అమెరికా వెళ్లారు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్ కి వెళ్లారు. ఎన్టీఆర్ 30 షూట్ త్వరలో ప్రారంభం కానుంది. షూటింగ్ మొదలయ్యాక ఎన్టీఆర్ కి తీరిక ఉండదు. ఈ కారణంతో ఎన్టీఆర్ కుటుంబంతో పాటు ఇంటర్నేషల్ ట్రిప్ ప్లాన్ చేశారు. 

అమెరికాలోని ప్రఖ్యాత నగరాలను ఎన్టీఆర్ సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన న్యూయార్క్ సిటీలో ఒక ఇండియన్ రెస్టారెంట్ ని సందర్శించారు. జునూన్ ఎం వై సి అనే ఈ రెస్టారెంట్ లో తాను బెస్ట్ ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేసినట్లు చెప్పారు. తన ఇంటర్నేషనల్ ట్రిప్ లో అదే బెస్ట్ ఇండియన్ ఫుడ్ అంటూ కితాబు ఇచ్చారు. అలాగే సదరు హోటల్ సిబ్బందితో ఫోటో దిగారు. ఎన్టీఆర్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. 

కాగా న్యూ ఇయర్ వేడుకలు ముగించుకొని జనవరిలో ఎన్టీఆర్ హైదరాబాద్ వస్తారు. సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ 30 అధికారికంగా పూజా కార్యక్రమాలు జరుపుతారు. అనంతరం ఫిబ్రవరి నుండి ఎన్టీఆర్ 30(NTR 30) రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుందని సమాచారం. దర్శకుడు కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. 

ఇక ఆర్ ఆర్ ఆర్(RRR Movie) ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ లో షార్ట్ లిస్ట్ అయ్యింది. నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్ లో షార్ట్ లిస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్ ఒక అడుగు ముందుకేసింది. అలాగే ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి రెండు విభాగాల్లో నామినేట్ అయ్యింది. జనవరిలో ఈ అవార్డ్స్ ప్రకటించనున్నారు. ఇక జపాన్ బాక్సాఫీస్ దున్నేస్తున్న ఆర్ ఆర్ ఆర్ అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది. 

click me!