Meena: భర్త మరణం తర్వాత మొదటిసారి కెమెరా ముందుకు!

By Sambi ReddyFirst Published Dec 26, 2022, 9:49 AM IST
Highlights

విషాదం అనంతరం మొదటిసారి మీనా కెమెరా ముందుకు వచ్చారు. భర్త మరణంతో బ్రేక్ తీసుకున్న ఆమె నటిగా బిజీ కానున్నారు. 
 

జూన్ 28న మీనా జీవితంలో అతిపెద్ద విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరిన విద్యాసాగర్ ఊహించని విధంగా కన్నుమూశారు. భర్త మరణం మీనాను తీవ్ర వేదనకు గురి చేసింది. తక్కువ ప్రాయంలోనే ఆమె తోడును కోల్పోయారు. మీనాకు నైనిక అనే ఒక కూతురు ఉన్నారు. చక్కని చిన్న కుటుంబం చిన్నాభిన్నం అయ్యింది. నటిగా మీనాది నాలుగు దశాబ్దాల ప్రస్థానం. బాలనటిగా పరిశ్రమలో అడుగుపెట్టిన మీనా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించారు. వందల చిత్రాల్లో నటించారు. 

2009లో మీనా బెంగుళూరుకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు విద్యాసాగర్ ఆమెకు శాశ్వతంగా దూరం అయ్యారు. భర్త మరణంతో మీనా డిప్రెషన్ కి గురయ్యారు. తోటి హీరోయిన్స్ ఆమెను కలిసి ఓదార్చారు. మానసిక వేదన నుండి బయటపడేందుకు మీనా కూతురితో పాటు వెకేషన్ కి వెళ్లారు. ఈ టూర్ నుండి తిరిగొచ్చిన మీనా మరరా కెమెరా ముందుకు రానున్నారట. ఆమె నటిగా బిజీ కానున్నారట. 

ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయనున్నారట. మోహన్ లాల్ కి జంటగా దృశ్యం 3లో మీనా నటించనున్నారని సమాచారం. దృశ్యం రెండు భాగాల్లో మోహన్ లాల్-మీనా జంటగా నటించారు. ఈ రెండు భాగాలు తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు. తెలుగు వర్షన్స్ లో కూడా మీనానే హీరోయిన్ గా నటించడం జరిగింది. 

ఈ ఏడాది విడుదలైన బ్రో డాడీ, సన్ ఆఫ్ ఇండియా చిత్రాల్లో మీనా నటించారు. తమిళ చిత్రం రౌడీ బేబీ, మలయాళ చిత్రం జనమ్మ డేవిడ్ చిత్రాల్లో మీనా నటిస్తున్నారు. 46 ఏళ్ల మీనా 90లలో స్టార్ హీరోయిన్ గా వెలిగారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇరవైకి పైగా చిత్రాలు చేశారు. హోమ్లీ లుక్, క్యూట్ యాక్టింగ్ మీనా ప్రధాన బలాలు. కన్నీరు పెట్టించే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మీనా అద్భుత నటన కనబరిచారు. 
 

click me!