Spy Teaser : నిఖిల్ ‘స్పై’ టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్.. ఫస్ట్ టైమ్ ఐకానిక్ ప్లేస్ లో రిలీజ్ కు ఏర్పాట్లు

By Asianet News  |  First Published May 13, 2023, 3:39 PM IST

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో అలరిస్తున్నారు. ప్రస్తుతం Spy మూవీతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ పై ఇచ్చిన అప్డేట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. 
 


రొటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటూ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) ఇండస్ట్రీలో తన మార్క్ క్రియేట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో  ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నిఖిల్ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రాబోతున్నారు. చివరిగా ‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఆ వెంటనే వచ్చిన ‘18 పేజెస్’ కూడా ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ Spy. గతంలోనే ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించి రెగ్యూలర్ షూట్ ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 

వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తున్నారు. వారం కిందనే చిత్ర టైటిల్ లోగోను విడుదల చేయడంతో పాటు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. మోషన్ పోస్టర్ ను వదలడంతో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్ నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ అందింది. టీజర్ ను కూడా రిలీజ్ కు రెడీ చేస్తున్నట్టు తెలిపారు. 

Latest Videos

నిఖిల్ అధికారికంగా అందించిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. Spy Teaserను మే15న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం, కర్తవ్యపథ్ దగ్గర టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారిగా ఐకానిక్ ల్యాండ్ మార్క్ వద్ద టీజర్ విడుదల చేయబోతుండటం విశేషం. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా సినిమాగా ఐదు ప్రధాన భాషల్లో విడుదల కాబోతోంది.  

యాక్షన్ థ్రిల్లర్ ‘స్పై’ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడు  నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. దేశంలో అత్యంత రహస్యంగా ఉంచిన విషయాలు కూడా చెప్పేలా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో నిఖిల్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించారు. ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎడ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్ (Iswarya Menoon) కథానాయిక. జూన్ 29న చిత్రం రిలీజ్ కాబోతోంది.

It's an Honour to be able to Launch Movie teaser from NETAJI Statue at Kartavya Path (RajPath) New Delhi🔥this 15th May 🙏🏽

Brace yourselves for the FIRST-EVER movie teaser launch at the iconic landmark💥 🇮🇳 … pic.twitter.com/Z8LW1HmBHA

— Nikhil Siddhartha (@actor_Nikhil)
click me!