బ్రేకింగ్: షూటింగ్ లో ప్రమాదానికి గురైన హీరో నిఖిల్

Published : Mar 10, 2021, 09:53 PM IST
బ్రేకింగ్: షూటింగ్ లో ప్రమాదానికి గురైన హీరో నిఖిల్

సారాంశం

నిఖిల్ డూప్ లేకుండా యాక్ష‌న్ సీక్వెన్స్  చేస్తూ రిస్క్ చేశాడట. ఆ సమయంలో చీల‌మండలం బెణ‌క‌డంతో  నిఖిల్ బాధతో క్రిందపడిపోయారట. కార్తికేయ 2 షూటింగ్ లో పాల్గొంటున్న నిఖిల్ కి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.   

హీరో నిఖిల్ ప్రమాదానికి గురయ్యారు.  నిఖిల్ పై కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది నిఖిల్ డూప్ లేకుండా యాక్ష‌న్ సీక్వెన్స్  చేస్తూ రిస్క్ చేశాడట. ఆ సమయంలో చీల‌మండలం బెణ‌క‌డంతో  నిఖిల్ బాధతో క్రిందపడిపోయారట. కార్తికేయ 2 షూటింగ్ లో పాల్గొంటున్న నిఖిల్ కి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 


దీనితో సినిమా షూటింగ్‌ను నిలిపేశార‌ట‌. వెంటనే ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా, కొన్ని రోజుల వ‌ర‌కు ఎలాంటి యాక్ష‌న్ స్టంట్స్ లో పాల్గొన‌వ‌ద్ద‌ని వైద్యులు సూచించిన‌ట్టు తెలుస్తుంది.  


కొన్నాళ్లుగా హిట్ లేక ఇబ్బందిపడుతున్న నిఖిల్... అర్జున్ సురవరం మూవీతో ఫార్మ్ లోకి వచ్చాడు. అనేక వ్యయప్రయాసల మధ్య విడుదలైన అర్జున్ సురవరం హిట్ కొట్టింది. ప్రస్తుతం కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Karan Johar: జాన్వీలా యాక్టర్లు ఏజెన్సీలు ఎందుకు మారుస్తారు? అసలు విషయం చెప్పిన కరణ్
రాజమౌళి సినిమాలని రీమేక్ చేస్తే అన్నీ సూపర్ హిట్లే.. అది మాత్రం ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయ్యిందో తెలుసా ?