ఊహకు మించిన రెస్పాన్స్... దూసుకుపోతున్న మడ్డీ టీజర్!

Published : Mar 10, 2021, 04:56 PM IST
ఊహకు మించిన రెస్పాన్స్... దూసుకుపోతున్న మడ్డీ టీజర్!

సారాంశం

మడ్డీ టీజర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ టీజర్ 15మిలియన్స్ వ్యూస్ దాటి వేసింది. దీనితో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆఫ్ రోడ్ రేస్ చిత్రంగా మడ్డీ తెరకెక్కుతుంది. ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రత్యర్ధులు తలపడే మడ్ రేస్ లు ఆసక్తి రేపనున్నాయి.   

దేశంలోనే మొట్టమొదటి మడ్ రేస్ చిత్రంగా తెరకెక్కుతుంది మడ్డీ. పాన్ ఇండియా చిత్రంగా మడ్డీ తెలుగు, మలయాళ, తమిళ్, కన్నడ మరియు హిందీ బాషలలో విడుదల కానుంది. ఇటీవల మడ్డీ టీజర్ ని వివిధ పరిశ్రమలకు చెందిన హీరోలు అర్జున్ కపూర్, జయం రవి మరియు ఫర్హాద్ ఫాజిల్ విడుదల చేశారు. 


కాగా మడ్డీ టీజర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ టీజర్ 15మిలియన్స్ వ్యూస్ దాటి వేసింది. దీనితో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆఫ్ రోడ్ రేస్ చిత్రంగా మడ్డీ తెరకెక్కుతుంది. ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రత్యర్ధులు తలపడే మడ్ రేస్ లు ఆసక్తి రేపనున్నాయి. 


ఈ మూవీలోని నటులకు రెండేళ్లు ఈ రేస్ లలో శిక్షణ ఇచ్చారట. దీనితో డూప్స్ ఎవరు లేకుండా నటులతో రియల్ గా సాహసాలు చేయించినట్లు చిత్ర యూనిట్ తెలియజేస్తున్నారు. యువాన్, రిధాన్ కృష్ణ, అనూషా సూరజ్ మరియు అమిత్ శివ్ దాస్ నాయర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

 
డాక్టర్ ప్రగబల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా పీకే 7 క్రియేషన్స్ బ్యానర్ లో ప్రేమ కృష్ణ దాస్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కెజిఎఫ్ ఫేమ్ రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?