డైరెక్టర్ వెంకటేశ్ మహా ‘కేజీఎఫ్’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నేచురల్ స్టార్ నాని (Nani) తాజాగా స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
కన్నడ సెన్సేషనల్ మూవీ ‘కేజీఎఫ్’పై కంచెరపాలం దర్శకుడు వెంకటేశ్ మహా రీసెంట్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చాలా దారుణంగా ఈ బ్లాక్ బాస్టర్ కమర్షియల్ ఫిల్మ్ పై కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. దీనిపై నెటిజన్లు, కేజీఎఫ్ లవర్స్, యష్ అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ డిబెట్ లో వెంకటేశ్ మహాతో పాటు నందినిరెడ్డి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ పాల్గొన్నారు. దీంతో వీరిపైనా విమర్శలు వచ్చాయి.
ఇందుకు మొదట నందినిరెడ్డి ఆడియెన్స్ కు సారీ చెప్పింది. ఆ తర్వాత వెంకటేశ్ మహా కూడా సారీ చెప్పారు. కానీ..తను వాడిన పరుష పదజాలానికే నని ఆయన మాట్లాడిన అంశంపై తగ్గెదే లేదన్నారు. ఈ క్రమంలో తాజాగా వెంటకటేశ్ మహా కామెంట్లపై నేచురల్ స్టార్ నాని కూడా స్పందించారు. ‘ఇటీవల దర్శకులు పాల్గొన్న డిబెట్ ను చూశాను. వెంకటేశ్ మాట్లాడిన తీరు సరికాదు. ఒక సినిమా చూశాక మనమే ఫ్రెండ్స్ తో ఒకలా చెప్పినా.. ఇంటర్వ్యూల్లో మాత్రం సరిగా చెబుతుంటాం. అలాంటి చర్చావేదికలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడి ఉండాల్సింది. ఆ ప్రొగ్రామ్ లో పాల్గొన్న నలుగురు దర్శకులు నాకు తెలుసు. వాళ్లకూ మాస్ అండ్ కమర్షిల్ సినిమాలే ఎంతో ఇష్టం. ఏదేమైనా ఇలా జరగడం దురదృష్టకరమనే చెప్పాలం’టూ స్పందించారు.
ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈనెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘దసరా’ Dasara. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ కు మరికొద్ది రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నాని ప్రచార కార్యక్రమాలను తానే ముందుండి చూసుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకటేశ్ మహా వివాదాస్పద వ్యాఖ్యలపై ఇలా స్పందించారు. సినిమా మార్చి 30న విడుదల కాబోతుండటంతో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.
నాని కేరీర్ లోనే ఈ చిత్రం పాన్ ఇండియన్ సినిమాగా విడుదల కాబోతోంది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర బ్యానర్స్ పై నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. నాని ఊరమాస్ లుక్ కు హైప్ పెరుగుతోంది.