Nani: అమెరికాలో ఆర్టీసీ ఎక్స్ రోడ్‌.. రీల్స్ చేసుకోవడానికి ఫోన్లు ఉచితం.. నాని ఎన్నికల మ్యానిఫెస్టో

Published : Nov 18, 2023, 07:31 PM ISTUpdated : Nov 18, 2023, 09:30 PM IST
Nani: అమెరికాలో ఆర్టీసీ ఎక్స్ రోడ్‌.. రీల్స్ చేసుకోవడానికి ఫోన్లు ఉచితం.. నాని ఎన్నికల మ్యానిఫెస్టో

సారాంశం

నాని `హాయ్‌ నాన్న` పేరుతో ఆయన రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.  తాజాగా అందరిని షాక్‌ కి గురి చేస్తూ ఎన్నికల మెనిఫెస్టో ప్రకటించారు. 

హీరో నాని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. పొలిటికల్‌ కండువా కప్పుకుని ఆయన ఫోటో షూట్‌ చేసి ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. `హాయ్‌ నాన్న` పేరుతో ఆయన రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు హింట్‌ ఇచ్చాడు. అంతేకాదు తాజాగా అందరిని షాక్‌ కి గురి చేస్తూ ఎన్నికల మెనిఫెస్టో ప్రకటించారు. జనాలకు, ముఖ్యంగా ఆడియెన్స్ కి, యూత్‌కి వరాల జళ్లు కురిపించారు. యూత్‌కి స్పెషల్‌ ఆఫర్స్ ప్రకటించారు. 

తన పార్టీ అధికారంలోకి వస్తే యూత్‌ అందరికి రీల్స్ చేసుకోవడానికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ప్రకటిస్తానని తెలిపారు. విచ్చలవిడిగా రీల్స్ చేసుకోవచ్చన్నారు. మరోవైపు అందరి ఆదాయం పెరిగేలా చూస్తామన్నారు. థియేటర్ల ఆదాయం, పక్కన ఉన్న కిరాణ కొట్టోళ్ల ఆదాయం కూడా పెరిగేలా బాధ్యత తీసుకుంటామన్నారు. అలాగే సబ్జెక్ట్, టాపిక్‌ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాగే వారి ఆదాయం కూడా పెంచుతామన్నారు. అంతేకాదు తనని గెలిపిస్తే ప్రతి జంక్షన్‌లో తన బొమ్మ ఉండేలా, ప్రతి థియేటర్లో మా `హాయ్‌ నాన్న` బొమ్మ ఉండేలా చూస్తామన్నారు. 

దీంతోపాటు వచ్చే వరల్డ్ కప్‌కి ఉచితంగా టికెట్లు వేయిస్తామన్నాడు. `హాయ్‌ నాన్న` పార్టీని గెలిపించుకోవడానికి ప్రతి తండ్రి, కూతుళ్లకి రెండు ఓట్లు కల్పిస్తాం. వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ లాగా అని, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికి ఓటు హక్కు కల్పిస్తున్నామని తెలిపారు. ఇక `హాయ్‌ నాన్న` సినిమా ఒక రోజు ముందు రావడానికి కారణం చెబుతూ, పార్టీపై కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలు కామనే. అలానే మేం కూడా వస్తున్నామని చెప్పారు. చాలా కాలంగా ఎన్‌ఆర్‌ఐలు తమపై ప్రేమ చూపిస్తున్నారని, దీంతో డల్లాస్‌లో, టెక్సాస్‌ ఇలా అన్నింటిలో ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ అనేది నిర్మించాలని ఫిక్స్ అయ్యాం. అక్కడ సంధ్యా 35ఎంఎం, 70ఎంఎం, దేవి, సుధర్శన్‌ వంటి థియేటర్లని కట్టిస్తామని చెప్పారు. 

అలాగే డిసెంబర్ 7న మార్నింగ్‌ బస్తా పేపర్లని తెచ్చుకోవాలని, కావాల్సిన స్టఫ్‌ మేమిస్తామని చెప్పారు. చివరగా మా పార్టీకే ఓటు వేయండి అని నాయకులు ఇలాంటి కబుర్లు చాలా చెబుతారు. మా సినిమానే చూడండి అని సినిమా వాళ్లు కూడా చాలా మాటలు చెబుతారు. కానీ మంచి నాయకుడినే ఎన్నుకోండి, మంచి సినిమానే చూడండి, బాధ్యతగా ఓటు వేయండి, బాధ్యతగా సినిమా చూడండి అని తెలిపారు నాని. 

ఇదంతా తాను హీరోగా నటించిన `హాయ్‌ నాన్న` సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ స్పెషల్‌ వీడియో ప్లాన్‌ చేశారు నాని. ఎలక్షన్ల ఫీవర్‌ని క్యాష్‌ చేసుకునేందుకు ఈ ప్రయత్నాలు చేశారు. కానీ ఈ కాన్సెప్ట్ ఆకట్టుకునేలా ఉంది. దీన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇది వైరల్‌ అవుతుంది. ఇక `హాయ్‌ నాన్న` చిత్రంలో నాని సరసన మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 7న విడుదల కాబోతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?