ఫ్యాన్స్ తో కలిసి ‘దసరా’ చూసిన నాని, కీర్తి సురేష్.. థియేటర్లలో అభిమానుల రచ్చ..

By Asianet NewsFirst Published Mar 30, 2023, 6:34 PM IST
Highlights

నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎదురుచూస్తున్న Dasara  ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది. థియేటర్లలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఓ థియేటర్ లో నాని, కీర్తి సురేష్ అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు.
 

రోటీన్ కు భిన్నంగా చిత్రాలు చేస్తున్నారు నేచురల్ స్టార్ నాని (Nani).  ఈక్రమంలో ఊరమాస్ అవతార్ లో లేటెస్ట్ గా నటించిన చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈరోజు (మార్చి 30)  ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. హిట్ టాక్ వినిపిస్తుండటంతో నాని అభిమానులు థియేటర్లలో రచ్చరచ్చ చేస్తున్నారు. నేచురల్ స్టార్ కొత్త అవతారానికి ఫిదా అవుతున్నారు. దీంతో సినిమా హాళ్ల వద్ద మొదటి షో నుంచి తెగ సందడి కొనసాగుతోంది.

అయితే హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్ అభిమానులతో కలిసి థియేటర్ లో సినిమాను వీక్షించారు. వీరీతో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఉన్నారు. వీరంతా క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి సినిమాను చూశారు. ‘దసరా’ టీమ్ రాకతో అభిమానులు, ఆడియెన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. నాని ఊరమాస్ పెర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఈ సందర్భంగా సుదర్శన్ థియేటర్ లో సందడి చేసిన నాని, కీర్తిలతో ఫ్యాన్స్ ఫొటోలు దిగేందుకు తెగ ప్రయత్నించారు. కొందరు అభిమానులు ఆ వీడియోలను నెట్టింట వదిలారు. ప్రస్తుతం ట్వీటర్ లో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి ‘దసరా’ తొలిరోజు మంచి టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం. కొత్త దర్శకుడైనా శ్రీకాంత్ ఓదెల తన ప్రతిభను చూపించారని అంటున్నారు. నాని, కీర్తి సురేష్ పెర్ఫామెన్స్, కొత్త బ్యాక్ డ్రాప్ కు ఫిదా అవుతున్నారు. ఇక సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం కూడా అద్భుతంగా ఉంది. 

Oora Mass Performance ❤️
Normal story with Best Cinematography , Top Notch BGM 🔥 Mahanati 🙏 nachindi anna ni Taking ✨ pic.twitter.com/XyN4AOEZHJ

— Rowdy Nani (@Rowdyfan_Nani)
click me!