రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి తన బంగ్లాకి రమ్మంది.. బిగ్ బాస్ రన్నరప్ షాకింగ్ కామెంట్స్

Published : Mar 30, 2023, 05:24 PM IST
రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి తన బంగ్లాకి రమ్మంది.. బిగ్ బాస్ రన్నరప్ షాకింగ్ కామెంట్స్

సారాంశం

మహిళలకి ఎదురవుతున్న వేధింపుల గురించి తరచూ వింటూనే ఉన్నాం. కానీ ఊహించని విధంగా ఇటీవల మహిళలపై కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయ్యారు. తమకు జరిగిన చేదు అనుభవాలని పంచుకున్నారు. నటులపై, నిర్మాతలపై, దర్శకులపై చాలా మంది నటీమణులు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

మహిళలకి ఎదురవుతున్న వేధింపుల గురించి తరచూ వింటూనే ఉన్నాం. కానీ ఊహించని విధంగా ఇటీవల మహిళలపై కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా బుల్లితెర నటుడు బిగ్ బాస్ 16 రన్నరప్ శివ ఠాక్రే తనకు ఎదురైనా కాస్టింగ్ కౌచ్ సంఘటనని వివరించాడు. అతడు చెప్పిన విషయాలు దిమ్మతిరిగేలా ఉన్నాయి. 

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక మహిళ తన ని లైంగికంగా వేధించే ప్రయత్నం చేసింది అని శివ ఠాక్రే పేర్కొన్నాడు. కానీ ఆమె పేరు మాత్రం బయటకి చెప్పలేదు. ఒకరోజు రాత్రి 11 గంటలకు ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఆడిషన్ ఉంది. ఒంటరిగా తన బంగ్లాకి రావాలని పిలిచింది. తనకు నాలుగు బంగ్లాలు ఉన్నాయని.. ఇండస్ట్రీలో పలుకుబడి ఉందని గొప్పలు చెప్పుకుంది. తాను చెప్పినట్లు చేసిన వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగారని కూడా చెప్పింది. 

ఆలస్యం చేయకుండా వెంటనే తన బంగ్లాకి రావాలని పేర్కొంది. అయితే ఆమె ఉద్దేశం ఏంటో నాకు అర్థం అయింది. లైంగిక కోరికలు తీర్చుకునేందుకే పిలుస్తోంది అని తెలుసు. దీనితో ఈ సమయంలో ఆడిషన్ ఏంటి అని నిలదీశాను. వెంటనే ఆమె బెదిరింపులకు దిగింది. నేను చెప్పినట్లు చేయకుంటే ఇండస్ట్రీలో నువ్వు ఉండలేవు. నీకు ఎలాంటి ఆఫర్స్ రావు అని బెదిరించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె మాటలు పట్టించుకోలేదు, భయపడలేదు అని శివ ఠాక్రే పేర్కొన్నారు. 

మరో దర్శకుడు ఆడిషన్ అని పిలిచి తనని బాత్రూమ్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అవకాశాల కోసం ఎంత కష్టపడుతున్నప్పటికీ దిగజారుడు పనులు మాత్రం తాను చేయలేదని శివ ఠాక్రే పేర్కొన్నాడు.. ఇండస్ట్రీలో అబ్బాయిలకు కూడా వేధింపులు తప్పవని పేర్కొన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?