మంచు మనోజ్ హోస్ట్ గా సరికొత్త గేమ్ షో.. ప్రోమో చూశారా? బదులిచ్చాడుగా..

హీరో మంచు మనోజ్ నుంచి ఊహించని సర్ప్రైజ్ అందింది. ఆయన హోస్ట్ గా సరికొత్త రియాలిటీ షో రాబోతోంది. దీనికి సంబంధించిన డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్రోమో ఆసక్తిని పెంచుతోంది.
 

Hero Manchu Manoj is  back with a Reality game Show NSK

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj)  రీసెంట్ గా ఓ అప్డేట్ ఇచ్చారు. కెమెరా ముందుకు వచ్చి నమస్కరిస్తున్న ఫొటోలను షేర్ చేశారు. కళామాతల్లి ముందుకు వచ్చినట్టు తెలిపారు. దీంతో మంచు మనోజ్ నుంచి సినిమా వస్తుందా? రియాలిటీ షో వస్తుందా? అనే సందేహాం నెలకొంది. తాజాగా దానికి సమాధానం దొరికింది. మంచు మనోజ్ నుంచి ఊహించని సర్ ప్రైజ్ అందింది. హోస్ట్ గా వ్యవహరిస్తూ సరికొత్త రియాలిటీ షోతో తిరిగి రాబోతున్నారు. 

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా మరియు ఈటీవీ విన్ నుంచి ఈ రియాలిటీ గేమ్ షో రాబోతోంది. దీనికి మంచు మనోజ్ హోస్ట్ గా వ్యవహరించడం ఆసక్తిగా మారింది. తాజాగా ఈ రియాలిటీ గేమ్ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రోమో మొత్తం మనోజ్ మళ్లీ ఎనర్జిటిక్ గా తిరిగి రాబోతున్నారని తెలియజేశారు. అలాగే ఆయన కెరీర్ ఖతం అనే ప్రచారానికి గట్టి బదులిస్తున్నట్టుగానూ ప్రోమోను విడుదల చేశారు. 

Latest Videos

ప్రోమో  గేమ్ షోపై చాలా ఆసక్తిని పెంచుతోంది. మనోజ్ వాయిస్ ఓవర్ తో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నట్టుగానే అనిపిస్తోంది. ‘నా ప్రపంచం మొత్తం సినిమా. నేను చిన్నప్పట్నుంచి పెంచుకున్న సినిమా మీద పెంచుకున్న ప్రేమ నా ప్రొఫెషన్ గా మారింది. నన్ను ఒక నటుడిగా, హీరోగానూ చేసింది. రాకింగ్ స్టార్ అనే బిరుదునూ ఇచ్చింది. ఫ్యాన్స్, విజిల్స్, అరుపులు, కేకలు ఇలా పండగలా జరిగిన నా లైఫ్ లోకి సడెన్ గా ఓ సైలెన్స్ వచ్చింది. మనోజ్ అయిపోయ్యారు అన్నారు. కెరీర్ ఖతం అన్నారు. యాక్టింగ్ ఆపేశారు. తిరిగి రారు అన్నారు. ఎనర్జిటిక్ రాక్ లో ఎనర్జి లేదన్నారు. విన్నాను, మౌనంగా భరించాను.. తిరిగి వస్తున్నాను.’ అంటూ మనోజ్ వాయిస్ అందించారు. 

అయితే, ప్రోమోలో మాత్రం ‘నాపై మూసుకుపోయిన అన్ని తలుపులకు చెబుతున్నా.. ఆ భవనం కొనడానికి తిరిగి వస్తున్నాను‘ అంటూ చూపించారు. మనోజ్ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన అంశాలను చూపించారని అనిపిస్తోంది. దీంతో ఈ గేమ్ షోకు మనోజ్ జీవితానికి ఏమైనా సంబంధం ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రోమో గ్రాండ్ గా ఉంది. దానికితోడు మనోజ్ గంభీరమైన వాయిస్ మరింతగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ గేమ్ షోకు సంబంధించిన డిటేయిల్స్ రానున్నాయి. ఈటీవీ విన్ లో ప్రసారం కానున్నంది. మరిన్ని వివరాలను అప్పటి వరకు వేచి ఉండాల్సిందే.

చాలా కాలం మనోజ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే ‘వాట్ ది ఫిష్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. దీంతో ఊహించని విధంగా గేమ్ షోతో అలరించేందుకు సిద్ధమవడం అభిమానులు ఖుషీ చేస్తోంది. మరోవైపు రవితేజ, మాస్ కా దాస్ గా విశ్వక్ సేన్ మల్టీస్టారర్ గా సందీప్ రాజు దర్శకత్వంలో ఓ చిత్రం రానుందని తెలుస్తోంది. ఇందులో విలన్ గానూ మనోజ్ నటిస్తున్నట్టు టాక్. ఇలా మళ్లీ మనోజ్ తన అభిమానులను అలరించేందుకు వరుస ప్రాజెక్ట్స్ తో సిద్ధం అవుతున్నారు. 

Priyamiyna abhimanula kosam,
Tirigosthunna koncham kothaga, Sarikothaga ramp adiyadaniki…
YOUR ROCKING STAR IS BACK WITH A GAME SHOW!https://t.co/PPfTs4grcQpic.twitter.com/4qBwN8nejB

— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1)
vuukle one pixel image
click me!