Manchu Manoj: మంచు మనోజ్ కారు ఆపి జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు.. ఏం జరిగిందంటే..

Published : Mar 30, 2022, 02:47 PM IST
Manchu Manoj: మంచు మనోజ్ కారు ఆపి జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు.. ఏం జరిగిందంటే..

సారాంశం

మోహన్ బాబు తనయుడు, హీరో మంచు మనోజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల మంచు మనోజ్.. మోహన్ బాబు బర్త్ డే వేడుకల సందర్భంగా నాగబాబుపై చేసిన పరోక్ష వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

మోహన్ బాబు తనయుడు, హీరో మంచు మనోజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల మంచు మనోజ్.. మోహన్ బాబు బర్త్ డే వేడుకల సందర్భంగా నాగబాబుపై చేసిన పరోక్ష వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. చాలా కాలంగా మంచు, మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా తాజాగా మంచు మనోజ్ కి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. మంచు మనోజ్ టోలి చౌకి వద్ద ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ పోలీసులు అతడి వాహనాన్ని ఆపారు. కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింని తొలగించి మంచు మనోజ్ కు రూ. 700 చలానా విధించారు. 

వాహనాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిలిం విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తూ రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు ఫైన్ విధిస్తున్నారు. 

వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా మరెవరూ తమ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించకూడదు అని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో టాలీవుడ్ లో ఇటీవల ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ కార్లకు కూడా బ్లాక్ ఫిలిం కారణంగా పోలీసులు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు మనోజ్ కూడా జరిమానాకు గురయ్యారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే