చూస్తే చాలా సింపుల్, కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్... మహేష్ టీ షర్ట్ ధర ఎంతంటే?

By Sambi ReddyFirst Published Nov 29, 2023, 3:22 PM IST
Highlights

హీరోలకు సంబంధించిన ప్రతి విషయం ప్రత్యేకమే. అభిమానులు వారిని గమనిస్తూ ఉంటారు. హీరోల జీవన శైలి అభిమానులను ప్రభావితం చేస్తుంది. కాగా మహేష్ బాబు ధరించి టీ షర్ట్ ధర హాట్ టాపిక్ గా మారింది. 
 

హీరో మహేష్ బాబు యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యానిమల్ యూనిట్ రన్బీర్ కపూర్, రష్మిక మందాన, సందీప్ రెడ్డి వంగ, అనిల్ కపూర్, భూషణ్ కుమార్ తో పాటు పలువురు హాజరయ్యారు. మహేష్ బాబు-రాజమౌళి టాలీవుడ్ నుండి ముఖ్య అతిథులుగా వేడుకలో పాల్గొన్నారు. 

మహేష్ ఈ ఈవెంట్ కి చాలా సింపుల్ గా వచ్చారు. ఆయన స్కై బ్లూ కలర్ స్లిమ్ ఫిట్ టీ షర్ట్ లో ఆకట్టుకున్నారు. అభిమానులు మహేష్ ధరించిన ఆ టీ షర్ట్ ని గమనించారు. అలాగే దాని ధర, వివరాలు సేకరించారు. సాధారణంగా కనిపిస్తున్న ఆ టీ షర్ట్ ధర మాత్రం మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. ఇంటర్నేషనల్ బ్రాండ్ 'గివెంచి'కి చెందిన సదరు టీ షర్ట్ ధర అక్షరాలా రూ. 47 వేలు. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. 

Latest Videos

మరోవైపు మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం 2024 జనవరి 12న విడుదల కానుంది. సంక్రాంతి బరిలో మహేష్ దుమ్మురేపుతాడని గుంటూరు కారం నిర్మాత సూర్యదేవర నాగవంశీ అంటున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. 

ఇక వచ్చే ఏడాది రాజమౌళి మూవీ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్న రాజమౌళి త్వరలో ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తారట. మహేష్ మూవీ సైతం రెండు భాగాలుగా విడుదల కానుందట. దీనికి అనుగుణంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. 

click me!