
హీరో మహేష్ బాబు చొక్కా విప్పింది లేదు. మహేష్ సిక్స్ ప్యాక్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో వేచి చూస్తారు. వారి కల రాజమౌళి మూవీతో తీరే సూచనలు కలవు. రాజమౌళి తన హీరోలను కండల వీరులుగా ప్రెజెంట్ చేస్తాడు. బాహుబలి నుండి రాజమౌళి ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ప్రభాస్, రానాల చేత ఆయన సిక్స్ ప్యాక్ చేయించారు. స్క్రీన్ పై గంభీరంగా కనిపించేందుకు భారీగా కండలు పెంచేలా శిక్షణ ఇప్పించారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా కండల వీరుల మాదిరి కనిపించారు. మహేష్ బాబుతో కూడా ఆయన జిమ్ చేయిస్తున్నారని, తన సినిమాకు సిద్ధం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు ఈ మధ్య ఎక్కువగా జిమ్ లో గడుపుతున్నారు. కఠిన కసరత్తులు చేస్తున్నారు. ఇదంతా రాజమౌళి సినిమా కోసమే అంటున్నారు. తాజాగా మహేష్ మరో వర్కింగ్ అవుట్ ఫోటో విడుదల చేశారు.
ఆయన చేతి కండరాలకు సంబంధించిన వర్క్ అవుట్ చేస్తున్నారు. చెమటలు చిందిస్తుంటే బలం వస్తున్న భావన కలుగుతుందని ఒక కామెంట్ కూడా పెట్టాడు. మహేష్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. కాగా మహేష్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పై రాజమౌళి-విజయేంద్రప్రసాద్ కసరత్తు చేస్తున్నారట. త్వరలో ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం అవుతుందట. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ తో మహేష్ మూవీ రాజమౌళి తెరకెక్కించనున్నారు. ఇది జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ బాబు కనిపిస్తారట. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం మహేష్ దర్శకుడు త్రివిక్రమ్ తో గుంటూరు కారం మూవీ చేస్తున్నారు.