Tollywood Update : కిరణ్ అబ్బవరం సెలబ్రేషన్స్... ఆసక్తికరంగా ‘ఇంద్రాణి’ ట్రైల‌ర్

Published : Feb 18, 2024, 10:24 PM IST
Tollywood Update : కిరణ్ అబ్బవరం సెలబ్రేషన్స్... ఆసక్తికరంగా ‘ఇంద్రాణి’ ట్రైల‌ర్

సారాంశం

టాలీవుడ్ లో ఆయా చిత్రాల నుంచి అప్డేట్స్ అందాయి. ‘ఇంద్రాణి’ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. కిరణ్ అబ్బవరం Kiran Abbavaram తన సినిమా సెలబ్రేషన్స్ లో మునిగి తేలారు.   

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ కు సూపర్ హిట్ ఇచ్చిన సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". ఇవాళ్టితో ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తవుతోంది.  "వినరో భాగ్యము విష్ణుకథ"మూవీ టీమ్ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. నూతన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు రూపొందించారు. ఈ చిత్రంలో కాశ్మీరా పరదేశి హీరోయిన్ గా నటించగా..మురళీ శర్మ ఓ కీ రోల్ చేశారు. గతేడాది ఫిబ్రవరి 18న గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చిన "వినరో భాగ్యము విష్ణుకథ" అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. 

"వినరో భాగ్యము విష్ణుకథ" సినిమాలో కిరణ్ అబ్బవరం పర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలించింది. సకుటుంబంగా ప్రేక్షకులు చూసే మంచి కథా కథనాలతో అందరినీ ఆకట్టుకుందీ సినిమా. మీడియా నుంచి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న వినరో భాగ్యము విష్ణు కథ మల్టీ జానర్ మూవీగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. కిరణ్ అబ్బవరం ఇలాంటి తరహా చిత్రాలు మరిన్ని చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన "దిల్ రూబా" సినిమాతో పాటు ఆయన సొంత ప్రొడక్షన్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాల పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

సూప‌ర్ ఉమెన్ మూవీ ఇంద్రాణి ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌లు

యానీయా భరద్వాజ్, క‌బీర్ దుహాన్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం ఇంద్రాణి. అత్యాదునిక సాంకేత‌క ప్ర‌మాణాల‌తో, వినూత్న‌భ‌రిత‌మైన టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీ ద్వారా స్టెఫన్ పల్లం ద‌ర్శ‌కుడిగా పరిచ‌య మ‌వుతుండ‌గా వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో సుధీర్ వేల్పుల, KK రెడ్డి, జైసన్ సహా నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సాయి కార్తిక్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫ్రనయిత జిజిన, గరీమా కౌశల్, ప్రతాప్ సింగ్, అజ‌య్‌, స‌ప్త‌గిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో ప్ర‌ద‌ర్శించారు. 

ఈ కార్య‌క్ర‌మానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌, ప్ర‌ముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో మెలోడిబ్రహ్మ మ‌ణిశ‌ర్మ, స్టాన్లీ ప‌ల్లం, స్టీఫెన్ ప‌ల్లం, సాయి కార్తిక్ , కో ప్రొడ్యూస‌ర్ కెకె రెడ్డి, న‌టుడు శ‌తాఫ్ ట్రైలర్, సినిమా గురించి మాట్లాడారు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు