
కన్నడ బాద్‌షా హీరో సుదీప్ నేడు తన పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. శనివారం(సెప్టెంబర్ 2)న తన 52వ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సుదీప్ తన అభిమానులకు తాజాగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. మరి బర్త్ డే రోజు ఆయన ఎందుకు క్షమాణపలు చెప్పారనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
సుదీప్ ప్రతి ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులను కలుస్తుంటాడు. తన నివాసంలో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేస్తుంటారు. వారితో ముచ్చటించడంతోపాటు వారితో ఫోటోలు దిగుతారు. అయితే ఈ సారి అభిమానులు ఎక్కువగా వచ్చారు. ఇంట్లోకి తోసుకుని రావడంతో కొందరికి గాయాలయ్యాయి. వారిలో పిల్లలు కూడా ఉన్నారు. బారీ కేడ్లు ఇరిగిపోయాయి. దీంతో సెక్యూరిటీ సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారిని కలవడం సుదీప్‌కి సాధ్యం కాలేదు.
ఈ సందర్భంగా తన అభిమానులకు సుదీప్ క్షమాపణలు చెప్పారు. `మీ అందరినీ కలవలేకపోయినందుకు క్షమించండి, అభిమానులు దూసుకుపోవడంతో ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగిపోయాయి, దీంతో పరువురికి ఇబ్బంది ఏర్పడింది. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. భద్రతాపరమైన కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు అభిమానులను కలవడం లేదు. త్వరలో మీ అందరినీ కలుస్తా` అని ట్విట్టర్ ద్వారా ఓ సెల్ఫీ వీడియోని విడుదల చేశాడు సుధీప్. ఇది వైరల్ అవుతుంది.
సుదీప్ తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా దగరయ్యాడు. తెలుగులో ఆయన `రక్తచరిత్ర`, `బాహుబలి`, `సైరా`, `ఈగ` చిత్రాల్లో నటించారు. `ఈగ`లో పూర్తి స్థాయిలో నటించి మెప్పించాడు. విలన్‌గా అదరగొట్టారు. ఇక చివరగా ఆయన `విక్రాంత్ రోణా` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. అందులో `మ్యాక్స్` అనే మూవీ ఉంది. విజయ్ కార్తికేయ దర్శకుడు. తన బర్త్ డే సందర్భంగా శనివారం కొత్త సినిమాని ప్రకటించారు. ఆర్ చంద్రూ దర్శకత్వంలో ఆర్ సీ స్టూడియోస్ పతాకంపై ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దీనికి రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ సూపర్ విజన్ చేస్తుండటం విశేషం.