'RX100' హీరో ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..?

Published : Sep 07, 2018, 02:48 PM ISTUpdated : Sep 09, 2018, 01:31 PM IST
'RX100' హీరో ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..?

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంటుంది. దాన్ని బట్టే నటీనటుల రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. 'RX100' చిత్రంతో విజయం అందుకున్న హీరో కార్తికేయ ఆ సక్సెస్ ను ఇప్పుడు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. 

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంటుంది. దాన్ని బట్టే నటీనటుల రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. 'RX100' చిత్రంతో విజయం అందుకున్న హీరో కార్తికేయ ఆ సక్సెస్ ను ఇప్పుడు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. అజయ్ భూపతి RX100 చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ ఇద్దరికీ ఈ సినిమా తరువాత ఆఫర్లు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరూ కూడా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. తాజాగా హీరో కార్తికేయ తనతో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలను కోటి రూపాయల పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక్క సినిమా సక్సెస్ తోనే కోటి అడగడంతో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. అతడికి రెమ్యునరేషన్ గా అంత మొత్తం ఇస్తే సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే ఆలోచనతో కొందరు నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తికేయ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న సినిమాలో హీరోగా నటించనున్నాడు. 

PREV
click me!

Recommended Stories

బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్