యాంకర్ తో హీరో ప్రేమాయణం!

Published : Sep 07, 2018, 02:32 PM ISTUpdated : Sep 09, 2018, 02:12 PM IST
యాంకర్ తో హీరో ప్రేమాయణం!

సారాంశం

బాలీవుడ్ నటుడు , దర్శకుడు, సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫర్హాన్ అక్తర్ ఓ యాంకర్ తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ లో తన యాంకరింగ్ తో కుర్రకారుని ఆకట్టుకున్న షిబానీ దండేకర్ తో రెండేళ్లుగా ఫర్హాన్ ప్రేమలో ఉన్నాడని టాక్.

దీనికి తగ్గట్లుగా షిబానీ.. ఫర్హాన్ తో ఉన్న ఫోటోలను, టూర్ లో ఫర్హాన్ తనకు తీసిన ఫోటోలు అంటూ కొన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసేది. దీంతో ఈ గాసిప్స్ మరింతగా హల్చల్ చేసేవి. తన భార్యతో విడాకులు తీసుకున్న ఫర్హాన్ ఇప్పుడు షిబానీతో తన రిలేషన్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకువెళ్లబోతున్నాడని అంటున్నారు.

షిబానీకి మూడు పదుల వయసు దాటుతున్నా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా బికినీల్లో కనిపిస్తూ తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా ఈ జంట కలిసున్న మరో ఫోటో బయటకి రావడంతో వీరిద్దరి బంధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

PREV
click me!

Recommended Stories

బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్