ప్రాజెక్ట్ కే... కమల్ హాసన్ కి వంద కోట్లు?

Published : Jun 25, 2023, 04:34 PM ISTUpdated : Jun 25, 2023, 04:41 PM IST
ప్రాజెక్ట్ కే... కమల్ హాసన్ కి వంద కోట్లు?

సారాంశం

ప్రాజెక్ట్ కే యూనిట్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు. కాగా కమల్ హాసన్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అవుతుంది.   


విక్రమ్ మూవీతో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు కమల్ హాసన్. ఆ చిత్రం నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దశాబ్దాల అనంతరం కమల్ ఓ భారీ కమర్షియల్ హిట్ కొట్టాడు. విక్రమ్ సక్సెస్ నేపథ్యంలో వివాదాలతో మరుగున పడిన భారతీయుడు 2ని కూడా పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఆయన ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. నెక్స్ట్ మణిరత్నం దర్శకత్వంలో మూవీ ప్రకటించారు. 

అనూహ్యంగా ప్రాజెక్ట్ కే లో కమల్ హాసన్ నటిస్తున్నారన్న ప్రకటన సంచలనం రేపింది. నిజానికి ప్రాజెక్ట్ కే షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్ట్ కే భారీ చిత్రం కాగా పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా సమయం తీసుకుంటుంది. మరో ఆరు నెలల్లో విడుదల అంటే చిత్రీకరణ చివరి దశకు చేరినట్లు లెక్క. 

ఇప్పుడు కమల్ హాసన్ నటిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన ఏ తరహా రోల్ చేస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఆయనది కేవలం కేవలం కొన్ని నిమిషాలు కనిపించే కేమియో కావచ్చు. పూర్తి స్థాయి పాత్ర అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఎప్పటి నుండో కమల్ హాసన్ ప్రాజెక్ట్ కే షూట్లో పాల్గొంటూ ఉండొచ్చు. అలా అయితే ఇన్ని రోజులు గోప్యంగా ఉంచడం కష్టం. 

కమల్ ని తీసుకోవడం వెనుక ప్రాజెక్ట్ కే మేకర్స్ మాస్టర్ ప్లాన్ మరొకటి ఉంది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఆయన చిత్రాలకు తెలుగు, హిందీలోనే మార్కెట్ ఉంది. బాహుబలి సిరీస్ మినహాయిస్తే ఏ చిత్రం కూడా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆడలేదు. ప్రస్తుత ఆదిపురుష్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఆ భాషల్లో కనీస ఆదరణ దక్కలేదు. కమల్ ప్రెజెన్స్ ప్రాజెక్ట్ కే మార్కెట్ కి ప్లస్ అవుతుంది. సౌత్  ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేయవచ్చు. 

ఇదిలా ఉంటే కమల్ ఈ చిత్రానికి ఏకంగా రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే ప్రభాస్, కమల్ హాసన్ రెమ్యూనరేషన్స్ చిత్ర బడ్జెట్ లో 50 శాతం అవుతాయి. ప్రభాస్ రూ. 150 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఈ క్రమంలో నిర్మాతలు కమల్ హాసన్ కి వంద కోట్లు ఇస్తారా? అంటే నమ్మడం కష్టమే. ప్రస్తుత కమల్ మార్కెట్ పరిగణలోకి తీసుకున్నా అన్ని కోట్లు ఇవ్వరు. ఈ ప్రచారంలో నిజం ఉండకపోవచ్చని కొందరి అంచనా... 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్