ఫ్లైట్ లో ఐఫోన్స్ మర్చిపోయిన ఊర్వశీ రౌటేలా.. సాయం కోరుతున్న బాలీవుడ్ నటి

By Asianet News  |  First Published Jun 25, 2023, 3:32 PM IST

బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా రీసెంట్ ప్రయాణంలో తన ఫోన్స్ ను మరిచిపోయింది. ఫైట్ లో మర్చిపోవడంతో బాధపడుతోంది. దీంతో తనకు హెల్ప్ చేయాలంటూ కోరుతోంది. 
 


బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) తెలుగు ప్రేక్షకులను స్పెషల్ అపియరెన్స్ తో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ క్రేజ్ సినిమా సినిమాకు పెరుగుతూ వస్తోంది. వరుస ప్రాజెక్ట్స్ తో ఈ ముద్దుగుమ్మ బిజీ అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ హాట్ టాపిక్ గ్గా మారుతుటుంది. రీసెంట్ గా క్రికెటర్ పంత్ పై ఆసక్తికరమైన పోస్టులు పెట్టి అందరి చూపు తనపై పడేలా చేసింది. ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీతో మళ్లీ వార్తలో నిలిచింది. 

ఈసారి ఏమైందంటే.. తన రెండు ఐఫోన్స్ ను విమానంలో మరిచిపోయినట్టు చెప్పింది. వాటిని వెతికేందుకు సాయం చేయాలంటూ రిక్వెస్ట్ చేసింది. ‘డియర్ విస్తారా.. నా రెండు ఐఫోన్లను నేను యూకే 772 ఫ్లైట్ లో మర్చిపోయాను. వాటి వాల్ పేపర్ నా ఫేరెంట్స్ ఫొటో ఉంటుంది. మీరు వెతకడం ఈజీ అవుతుంది. సహయం చేస్తారా‘ అంటూ రిక్వెస్ట్ చేసింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

Latest Videos

ఇక ఊర్వశీ తన ఫోన్స్ ను ఎలా తిరిగి పొందుతుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ఊర్వశీ అటు బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులోనూ వరుసగా అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్ గా ఊర్వశీ నటించిన ‘ఇన్ స్పెక్టర్ అవినాష్’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. మే 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తెలుగు చిత్రాల విషయానికొస్తే ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు ఉన్నాయి. 

ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’లో బాస్ పార్టీకి చిరు సరసన గ్లామర్  స్టెప్పులేసి అదరగొట్టింది. తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ తర్వాత ‘ఏజెంట్’లోనూ స్పెషల్ అపీయరెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేని - బోయపాటి శ్రీనివాస్ కాంబోలో వస్తున్న Boyapati Rapoలో స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న Bro చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

click me!