సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో కళ్యాణ్ రామ్ భారీ చిత్రం!

Published : May 26, 2021, 05:05 PM IST
సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో కళ్యాణ్ రామ్ భారీ చిత్రం!

సారాంశం

కళ్యాణ్ రామ్ 18వ చిత్ర టైటిల్ మే 28న మధ్యాహం 12:00 గంటలకు ప్రకటించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతుండగా వశిస్ట్ దర్శకుడిగా పనిచేస్తున్నారు.   

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బిగ్ అనౌన్స్మెంట్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు హీరో కళ్యాణ్ రామ్. తన తదుపరి చిత్రంపై ఆయన క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారు. కళ్యాణ్ రామ్ 18వ చిత్ర టైటిల్ మే 28న మధ్యాహం 12:00 గంటలకు ప్రకటించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతుండగా వశిస్ట్ దర్శకుడిగా పనిచేస్తున్నారు. 


కాగా ఈ మూవీ సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ లో తెరకెక్కుతుంది. ప్రకటన పోస్టర్ ని కూడా చాలా గ్రాండ్ గా, భిన్నంగా డిజైన్ చేశారు. గత ఏడాదే ఈ మూవీ షూటింగ్ మొదలైందని సమాచారం. అయితే చిత్ర యూనిట్ ఎటువంటి డిటైల్స్ బయటికి చెప్పలేదు. రేపు ఎన్టీఆర్ జయంతి నాడు టైటిల్ తో పాటు చిత్ర వివరాలు ప్రకటించనున్నారు. 


ఇక పటాస్ చిత్రం తరువాత కళ్యాణ్ రామ్ మరో హిట్ కొట్టలేదు. 2020 సంక్రాంతికి ఎంత మంచివాడవురా చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. దీనితో ఓ సాలిడ్ హిట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. తాజా మూవీ కళ్యాణ్ రామ్ కి మంచి హిట్ ఇవ్వడంతో పాటు ఇమేజ్ తెచ్చిపెడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది