బస్ డ్రైవర్ గా బాలకృష్ణ? అనిల్ రావిపూడి అలా డిసైడ్ చేశాడా!

By Sambi Reddy  |  First Published May 14, 2023, 9:47 AM IST

బాలకృష్ణ అనూహ్యంగా ఫార్మ్ లోకి వచ్చాడు. ఆయన గత రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. లేటెస్ట్ మూవీపై క్రేజీ బజ్ వినిపిస్తుంది. 



నందమూరి నట సింహం బాలయ్య ఒక దశలో పాతాళానికి పడిపోయారు. ఆయన్ని వరుస పరాజయాలు వెంటాడాయి. ఎన్టీఆర్ బయోపిక్స్ కి కనీస ఆదరణ దక్కలేదు. థియేటర్స్ ముందు ఉచిత ప్రదర్శన బోర్డ్స్ పెట్టుకున్నారు. పోస్టర్స్ ఖర్చు కూడా రాకపోవడంతో బాలయ్య పని అయిపోయిందని అందరూ భావించారు. ఎన్టీఆర్ బయోపిక్స్ అనంతరం విడుదలైన రూలర్ పరిస్థితి కూడా అదే. యంగ్ హీరోలతో పోటీ పడలేకపోయాడు. ఈ క్రమంలో కలిసి వచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. 

2021లో విడుదలైన అఖండ మూవీతో ఆయన కమ్ బ్యాక్ అయ్యారు. అఖండ బాలయ్య కెరీర్లో అతి పెద్ద విజయం సాధించింది. బాలయ్యను హిట్ ట్రాక్ ఎక్కించింది. ఇక 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. జోరు మీదున్న బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇచ్చారు. 

Latest Videos

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ 108వ చిత్రం  చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. బాలయ్య ఈ మూవీలో బస్ డ్రైవర్ గా కనిపించనున్నారట. ఆయన రోల్ చాలా డిఫరెంట్ గా అనిల్ రావిపూడి డిజైన్ చేశారట. ఇక బాలయ్య 108 చిత్ర టీజర్ ఆయన బర్త్ డే కానుకగా జూన్ 10న విడుదల చేయనున్నారట. ఈ మేరకుటాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అదే సమయంలో బాలకృష్ణ బాస్ డ్రైవర్ అన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. ఇది కేవలం పుకారు మాత్రమే అంటున్నారు. దీనిపై స్పష్టత రావాలంటే టీజర్ విడుదల వరకు ఆగాల్సిందే.

గతంలో బాలయ్య నటించిన లారీ డ్రైవర్ సూపర్ హిట్ కొట్టింది. విజయశాంతి-బాలయ్య జంటగా నటించారు. బాలయ్య 108 చిత్రానికి టైటిల్  నిర్ణయించాల్సి ఉంది. కాజల్ అగర్వాల్ బాలయ్యకు జంటగా నటిస్తున్నారు. కెరీర్లో మొదటిసారి వీరిద్దరూ జతకట్టారు. శ్రీలీల ఓ కీలక రోల్ చేస్తుంది. దసరా కానుకగా విడుదల కానుంది . 

click me!