Balakrishna: కరోనా నుండి కోలుకున్న బాలయ్య...!

Published : Jun 30, 2022, 08:13 AM IST
Balakrishna: కరోనా నుండి కోలుకున్న బాలయ్య...!

సారాంశం

బాలకృష్ణ ఫ్యాన్స్ కి నిజంగా ఇది బిగ్ న్యూస్. ఆయన కోవిడ్ నుండి కోలుకున్నట్లు సమాచారం వస్తుంది. త్వరలో బాలకృష్ణ షూటింగ్ లో కూడా పాల్గొననున్నారట. 

నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని బాలకృష్ణ స్వయంగా తెలియజేశారు. స్వల్ప అనారోగ్యానికి గురైన బాలయ్య వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే బాలకృష్ణ క్వారంటైన్ అయ్యారు. డాక్టర్స్ సలహాతో చికిత్స ప్రారంభించారు. ఇక తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక వారం రోజుల్లోనే ఆయన కోలుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తాజా వైద్య పరీక్షలో బాలయ్యకు నెగిటివ్ అని తేలిందట. ఆయన మరో వారం రోజుల్లో తిరిగి షూటింగ్ లో పాల్గొననున్నారట. బాలయ్య కోవిడ్ (Covid 19)నుండి కోలుకున్నారన్న వార్త అభిమానుల్లో ఆనందం నింపింది. బాలయ్యకు కరోనా అని తెలిసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. 

ఇక దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న బాలయ్య చిత్రం చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది మేకర్స్ ఆలోచన. మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ వీడియో ఆకట్టుకుంది. బాలయ్య 107వ (NBK 107)చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

అలాగే ఆగస్టు నుండి దర్శకుడు అనిల్ రావిపూడి మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలయ్య-అనిల్ రావిపూడి మూవీపై అధికారిక ప్రకటన రాగా... ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో సెకండ్ సీజన్ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌