బిగ్ ట్విస్ట్.. శ్రీలంక యువతి కేసులో హీరో ఆర్యకు రిలీఫ్.. అసలు దొంగలు ఎవరంటే

pratap reddy   | Asianet News
Published : Aug 25, 2021, 08:24 PM IST
బిగ్ ట్విస్ట్.. శ్రీలంక యువతి కేసులో హీరో ఆర్యకు రిలీఫ్.. అసలు దొంగలు ఎవరంటే

సారాంశం

తమిళ హీరో ఆర్య ఊహించని విధంగా ఓ యువతి కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంకకు చెందిన యువతి.. హీరో ఆర్య తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి రూ 70 లక్షలు తీసుకున్నాడని కేసు నమోదు చేసింది.

తమిళ హీరో ఆర్య ఊహించని విధంగా ఓ యువతి కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంకకు చెందిన యువతి.. హీరో ఆర్య తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి రూ 70 లక్షలు తీసుకున్నాడని కేసు నమోదు చేసింది. దీనితో ఆర్య ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

ఆర్య పోలిసుల విచారణకు కూడా హాజరయ్యాడు. కానీ చివరకు ఆ అమ్మాయితో ఆర్యకు ఎలాంటి సంబంధం లేదని, అతడు నిర్దోషి అని తేలింది. కేసులో చాలా ట్విస్ట్స్ చోటు చేసుకున్నాయి. 

తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ 70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆ యువతి ఆరోపించింది. ఆర్య తనతో చాట్ చేసినట్లు స్క్రీన్ షాట్స్ కూడా చూపించింది. దీనితో పోలీసులు ఆర్యని విచారణకు కూడా పిలిచారు. పోలీసులు ఆదేశాల మేరకు ఆర్య విచారణకు సహకరించాడు. 

కొన్ని రోజుల క్రితం ఆర్య చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. ఎలాంటి నేరం చేయని ఆర్య పోలీసులు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం ఇచ్చాడు. దీనితో ఆర్య నిర్దోషి అని పోలీసులు అంచనాకు వచ్చారు. మరోకోణంలో కేసు విచారణ ప్రారంభించగా పోలీసులకు బిగ్ ట్విస్ట్ ఎదురైంది. 

హీరో ఆర్య పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా తయారు చేసిన మహమ్మద్ అర్మాన్, మహమ్మద్ హుస్సేనీ ఇద్దరు ఆ యువతిని చీట్ చేసినట్లు తేలింది. పోలీసులు వారిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. నిజమైన దోషులని అరెస్ట్ చేసిన పోలీసులకు ఆర్య కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఆరోపణలు తన మనసుకి బాధ కలిగించినట్లు పేర్కొన్నాడు. 

PREV
click me!

Recommended Stories

తారక్‌కు ఒక స్టోరీ చెప్పాను.. కానీ.! ఆ రోజు అలా జరగకపోయి ఉంటే..
పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా..? డైరెక్టర్ ఎవరో తెలుసా?