అన్నం లేకుండా రోజంతా మద్యం... రోల్ కోసం ఆనంద్ దేవరకొండ డెడికేషన్ !

By Sambi Reddy  |  First Published Jul 18, 2023, 3:34 PM IST

దర్శకుడు సాయి రాజేష్ బేబీ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. టాక్ తో సంబంధం లేకుండా బేబీ మంచి వసూళ్లు రాబడుతుంది. ఈ చిత్ర మేకింగ్ లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు సాయి రాజేష్ షేర్ చేశారు. 
 


ఈ చిత్ర హీరో ఆనంద్ దేవరకొండ భగ్న ప్రేమికుడిగా కనిపిస్తాడు. క్లైమాక్స్ లో ప్రియురాలు చేసిన మోసానికి ముందుకు బానిసవుతాడు. తిండి నిద్ర లేకుండా ప్రేయసి ఊసులతో బ్రతికేస్తాడు. లవ్ ఫెయిల్యూర్ తో ముందుకు అలవాటు పడ్డ యువకుడిగా నటించి మెప్పించాడు. ఈ సన్నివేశాలు సహజంగా రావడానికి ఆనంద్ దేవరకొండ నిజంగానే మందు తాగాడట. ప్రతిరోజూ పరగడుపున టకీలా మూడు షాట్స్ వేయించేవారట. రోజంతా వోడ్కాలో కొబ్బరి నీళ్లు కలిపి తాగించారట. 

దర్శకుడు సాయి రాజేష్ ఏం కోరితే ఆనంద్ దేవరకొండ అది చేశాడట. అసలు నిల్చుంటే రోగాలు వస్తాయేమో అన్నట్లున్న పరిసరాల్లో ఆనంద్ దేవరకొండ నటించాడని సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు. పాత్ర కోసం ఆనంద్ దేవరకొండ డెడికేషన్ అద్భుతమని ఆయన కొనియాడారు. అలాగే హీరోయిన్ వైష్ణవి చైతన్య ఈ ప్రాజెక్ట్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడింది. తన సమస్యలు తెలిసినా నేను ఆదుకునే పరిస్థితి లేదు. అన్ని ఇబ్బందులను ఓర్చుకుని బేబీ చిత్రం చేసిందని సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు. 

Latest Videos

బేబీ గొప్ప మూవీ కాకపోయినా నెగిటివ్ పబ్లిసిటీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇది మరో ఆర్ఎక్స్ 100 అనే టాక్ యూత్ లోకి వెళ్ళింది. దాంతో సినిమాను ఎగబడి చూస్తున్నారు. బేబీ చిత్రాన్ని ఎస్ కె ఎన్ నిర్మించారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. బేబీ సక్సెస్ మీట్ కి విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. 

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... గత కొద్ది రోజులుగా చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమా ప్రేమికుడిగా, తమ్ముడు సక్సెస్ చూసిన అన్నయ్యగా చాలా హ్యాపీ. నేను జులై 13న నేను బేబీ ప్రీమియర్స్ చూశాను. అందరూ నా రెస్పాన్స్ కోసం వెయిటింగ్. కానీ నేనేమీ మాట్లాడలేకపోయాను. గొంతు పట్టుకుపోయింది. మాటలు రాలేదు. మొదటిసారి నేను హీరో అనే భావన మర్చిపోయి ప్రేక్షకుడిగా సినిమా ఎంజాయ్ చేశాను. 

మంచో చెడో ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటారు. డిబేట్స్ పెడుతున్నారు. అంటే సాయి రాజేష్ ఒక బలమైన కథ చెప్పారని, అది ఎంతగానో ప్రభావితం చేసిందని అర్థం అవుతుంది. సొసైటీల్లో ప్రేమికులను మోసం చేసే అమ్మాయిలు ఉన్నారు. అలా అని అందరూ అలాంటి అమ్మాయిలే ఉన్నారని కాదు. అబ్బాయిల్లో కూడా ఉన్నారు. నాకు మాత్రం అందమైన మనసున్న అమ్మాయిలే తారసపడ్డారు. 

ఈ మూవీలో ప్రేమికులు ఇలా చేయకూడదు, ఇలా చేయండి అని చెప్పారు. నా తమ్ముడు నటుడు అవుతానంటే చాలా కష్టం అని చెప్పాను. నటన అంత ఈజీ కాదు. నా అనుభవం నేపథ్యంలో అదే చెప్పాను. నా దగ్గరకు చిన్న విషయం కూడా తీసుకురాడు. బేబీ మూవీ కథ కూడా నాకు చెప్పలేదు. సొంతగా ఎదగాలని నేను కోరుకున్నాను అదే చేస్తున్నాడు. మారుతి ఎస్ కె ఎన్ ని నిర్మాతను చేస్తే.. ఎస్ కె ఎన్ సాయి రాజేష్ కి దర్శకుడిగా లిఫ్ట్ ఇచ్చాడు. ఒకరికొకరు అందిస్తున్న సహకారం గొప్పది. నటుడు విరాజ్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఇక వైష్ణవి చైతన్య అద్భుతం చేసింది. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీ. అందరికీ ఆల్ ది బెస్ట్. సాయి రాజేష్ నెక్స్ట్ ఎలాంటి కథ చేస్తాడనే ఆసక్తి కలుగుతుంది. అతను మరిన్ని విజయాలు సాధించాలి, అన్నారు. 
 

click me!