
పుష్ప మూవీ అల్లు అర్జున్ ఇమేజ్ పూర్తిగా మార్చేసింది. ఇండియా వైడ్ ఆయన్ని పాప్యులర్ చేసింది. 2021లో విడుదలైన పుష్ప హిందీలో అనూహ్య విజయం సాధించింది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
పుష్ప చిత్రానికి కొనసాగింపుగా పుష్ప 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం సౌత్ కి మించి నార్త్ లో క్రేజ్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థ సర్వేలో సంచలన నిజాలు బయటపడ్డాయి. హిందీలో రాబోయే చిత్రాల్లో దేని కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సర్వే నిర్వహించగా మెజారిటీ ఆడియన్స్ పుష్ప 2 ని ఎంచుకున్నారు. టాప్ 5 చిత్రాల్లో పుష్ప 2 అగ్రస్థానంలో నిలిచింది.
అనంతరం హేరా పేరి 3 ఉంది. ఇక మూడో స్థానంలో ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న వార్ 2 ఉంది. నాలుగో స్థానంలో భూల్ బులయా 3, ఐదో స్థానంలో సింగం అగైన్ నిలిచాయి. స్థానిక హీరోల సినిమాల కంటే కూడా సౌత్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ కోసం నార్త్ జనాలు ఎదురు చూడటం ఆయన క్రేజ్ కి నిదర్శనం.
షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రష్మిక మందాన హీరోయిన్. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. అనసూయ, సునీల్, రావు రమేష్ కీలక రోల్స్ చేస్తున్నారు. పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.